ఇంతకాలం తమ పబ్బం గడుపుకోడానికి మతం మారిన రేజర్వేషన్లు వర్తిస్తాయంటూ అమాయక దళితులను నమ్మిస్తూ మాట మార్పిడి చేసుకుంటూ వచ్చారు. ఆపాస్టర్లు చెప్పే మాయ మాటలు నమ్మి మతం మార్చుకుని చివరికి వారికి సహజ సిద్దముగా ప్రభుత్వం ద్వారా రేజర్వేషన్లను కోల్పోయినవారెందరో. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఓటు బ్యాంకు రాజకీయాలకోసం మతం మారినా రేజర్వేషన్లను చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా కొనసాగిస్తూ వచ్చారు. కానీ తాజాగా ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పు మతం మారిన దళిత క్రిస్టియన్ లకు వ్యతిరేకంగా ఇచ్చింది. క్రిస్టియానిటీ లో కుల భావన లేదు కాబట్టి ఆ మతం తీసుకున్నవారిని హిందూ ఎస్సీ లుగా పరిగణించలేమని తీర్పు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశము అయింది.
సుప్రీమ్ కోర్ట్ ఎప్పడో తేల్చేసింది
మతం మార్చుకున్న వారికి రేజర్వేషన్లు వర్తించవని సుప్రీమ్ కోర్ట్ పలు సందర్భాలలో తీర్పు ఇచ్చింది. మతం మార్చుకున్న వ్యక్తులు వివిధ సందర్బాలలో తమను ప్రశ్నించిన వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఈ సూత్రం 1950 లోని రాజ్యాంగ ఆర్డర్ గ రూపొందిందని సుప్రీమ్ కోర్ట్ గతంలో తెలిపింది.
ఘర్ వాపసీ ద్వారా తిరిగి రిజర్వేషన్లు పొందవచ్చును
క్రిస్టియానిటీ వదిలిపెట్టి తిరిగి హిందూ మతంలోకి వచ్చినట్లయితే వారికి తిరిగి ఎస్సి హోదా తిరిగి పునరుద్దరించవచ్చని 2015 లో సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇచ్చింది.
