అమరావతి పునర్నిర్మాణానము కూటమి ప్రభుత్వము వలన మాత్రమే సాధ్యమవుతుందని గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలవలన రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు. దేశానికే తలమానికంగా అమరావతి నగర నిర్మాణం చేస్తామన్నారు. రాజధాని కోసం మహిళలు చూపినా తెగువ అభినందనీయం అని శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీయే కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న కారణంగా ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామని అన్నారు.కాశ్మీర్లో ఉగ్రదాడుల అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఉద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ప్రధాని అమరావతి పునర్నిర్మాణానికి రావడం ఆనంద దాయకమన్నారు. ప్రసంగం అనంతరం ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ ని దగ్గరకు పిలచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చాక్లేట్ బహుకరించండం చూపరులను ఆకట్టుకొంది
previous post
