Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఆ ప్రభావం ప్రపంచదేశాలతో పాటుగా భారత్ పై పడుతోంది. ఈ మేరకు భారత్ లో ఇంధన కొరత నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మార్చి 27న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
దిల్లీలోని తన అధికారిక నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇక రెండు రోజుల క్రితం త్రివిధ దళాధిపతులతో కేంద్రం సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే నిన్న అఖిలపక్ష భేటీ నిర్వహించారు. మరోవైపు రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. నాలుగు వారాలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు యుద్ధాన్ని ముగించేందుకు సంధి చర్చలు జరుగుతున్నా అవి ఫలించడం లేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. దాంతో ఇరాన్- అమెరికా మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం ఇప్పుడు ప్రపంచదేశాల్ని అతలాకుతలం చేస్తోంది. ఈ యుద్ధ మేఘాల ప్రభావం భారత్‌ పైనా పడుతోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ (LPG) సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చమురు సరఫాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మార్చి 27 సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. యుద్ధం కారణంగా భారత్‌ లో గ్యాస్, పెట్రోల్ కష్టాలు మొదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related posts

అమెరికా గెలవదు – ఇరాన్ ఓడిపోదు : రాందేవ్ బాబా జోస్యం

M HANUMATH PRASAD

పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ ఏఎస్ ఓకా కీలక వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

బెంగళూరు ఎయిర్ పోర్ట్ పై చంద్రబాబు ప్రశంసలు

M HANUMATH PRASAD

పేలిన సెల్ ఫోన్.. 14 ఏళ్ళ బాలిక మృతి

M HANUMATH PRASAD

పంజాబ్ నుంచి రాజ్యసభకు కేజ్రీవాల్?

M HANUMATH PRASAD

భార్యకు ప్రియుడితో హోటల్లో ఉండే హక్కు ఉందన్న కోర్టు!

M HANUMATH PRASAD