Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

పిలక, పంచకట్టు నచ్చలేదని.. ఎస్ఐ అయ్యాక భర్తకు విడాకులు!

పురోహిత్యం చేసిన కష్టార్జితంతో భార్యను చదివించి ఎస్ఐ చేసిన భర్తకు భార్య ఊహించని షాక్ ఇచ్చింది. భర్త పిలక, పంచెకట్టు నచ్చలేదని విడాకులు ఇచ్చింది.
ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కష్టపడి భార్యను చదివించి ప్రయోజకురాలిని చేస్తే.. చివరకు ఆమె ఉద్యోగం వచ్చాక భర్తనే కాదనుకుంది. వృత్తిరీత్యా పౌరోహిత్యం చేసే సదరు భర్త, తన భార్యను కష్టపడి చదివించాడు. ఆమె సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) ఉద్యోగం సాధించడంలో అండగా నిలిచాడు. అయితే, ఎస్ఐగా ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది.
భర్త సంప్రదాయబద్ధంగా ధరించే దోతీ-కుర్తా, తలకు ఉండే పిలక (శిఖ) తనకు నచ్చడం లేదని, అవి తన పోలీస్ ఆఫీసర్ హోదాకు అవమానకరంగా ఉన్నాయని ఆమె వాదిస్తోంది. దీంతో ఆమె భర్త నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తన భర్తతో కలిసి బయట తిరగాలంటే ఇబ్బందిగా ఉందని ఆమె కోర్టులో పేర్కొంది. న్యాయమూర్తులు, కౌన్సిలర్లు ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమె తన నిర్ణయానికే కట్టుబడి ఉండటంతో అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు మహిళ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు

Related posts

ఒమర్‌ vs మెహబూబా.. ‘తుల్‌బుల్‌’పై మాటల యుద్ధం!

M HANUMATH PRASAD

లోయలో పడ్డ ఆర్మీ వాహనము, ముగ్గురు జవాన్ల దుర్మరణం

సుప్రీం జడ్జీలుగా ముగ్గురు

M HANUMATH PRASAD

సీఈసీ, ఈసీలకు జీవితకాల రక్షణ పై సుప్రీంకోర్టు సీరియస్.. కేంద్రానికి నోటీసులు

M HANUMATH PRASAD

కోర్టు ముందు సీబీఐ హాజరు కాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

M HANUMATH PRASAD

పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్

M HANUMATH PRASAD