Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

బ్రూక్లిన్ జైలు.. నరకానికి నకలు

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను అమెరికా అరెస్ట్ చేసి న్యూయార్క్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిని బ్రూక్లిన్‌లో జైల్లో(MDC)లో ఉంచారు.
అయితే ఈ జైలుపై చాలా ఆరోపణలున్నాయి. ప్రముఖ స్టార్లు అరెస్టయినపుడు ఇదే జైలులో ఉన్నప్పటికీ న్యూయార్క్ న్యాయస్థానాలు కూడా ఈ జైలు మీద విముఖత చూపిస్తారట. బ్రూక్లిన్‌ ఎండీసీ జైలును 1990లో ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ సుమారు 1300 మంది ఖైదీలు ఉన్నారు. వైట్‌కాలర్‌ నేరాలు చేసినవారితో పాటు గ్యాంగ్‌స్టర్లు, మాదకద్రవ్యాల కేసుల నిందితులను ఇక్కడికి తరలిస్తారు. హోండురస్‌ మాజీ అధ్యక్షుడు జువాన్‌ ఆర్లాండో హెర్నాండెజ్‌, మెక్సికో డ్రగ్‌ మాఫియా నేతలు, వెనెజువెలా మాజీ నిఘా చీఫ్‌ హ్యూగో కార్వాజల్‌ వంటి కీలక వ్యక్తులతోపాటు, ప్రస్తుతం వెనెజువెలా అధ్యక్షుడు మదురో కూడా ఇదే జైలులో ఉన్నారు.

న్యూయార్క్ లోని స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీకి దగ్గరగా ఉన్న ఈ జైలును చాలామంది “నరకానికి నకలు”గా భావిస్తారు. ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని ఫిర్యాదులు చేస్తుంటారు. 2024లో ఇద్దరు ఖైదీలు హత్యకు గురయ్యారు. జైలు సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారని, డ్రగ్స్ కు అనుమతిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అనేకసార్లు ఖైదీల మధ్య తీవ్రస్థాయి గొడవలు కూడా జరిగాయి. 2019లో పవర్ కట్ వల్ల ఖైదీలు వారం రోజుల పాటు చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Related posts

చేతులకు సంకెళ్లతో బందీగా న్యూయార్క్ లో మదురో: గుడ్ నైట్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విష్.. !!

M HANUMATH PRASAD

బలూచ్ వేర్పాటు వాదులకు భారత్ మద్దతిస్తే!?

M HANUMATH PRASAD

ట్రంప్‌కు టారిఫ్‌లు విధించే అధికారాల్లేవ్‌.. కోర్టు సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

కరాచీ ఎయిర్పోర్ట్ లో అద్వాన్న స్థితి -పాక్ నటి ఆరోపణ

M HANUMATH PRASAD

మరో నగరాన్ని స్వాధీనం చేసుకున్న బిఎల్ ఎ

M HANUMATH PRASAD

సుప్రీంకోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన ట్రంప్

M HANUMATH PRASAD