Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

మదురోను విడిచిపెట్టాలని రష్యా డిమాండ్.. యూఎస్ దాడిని ఖండించిన చైనా

వెనిజులాపై యూఎస్ దాడులను పలు దేశాలు ఖండించాయి. వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో, ఆయన భార్య ప్రస్తుతం యూఎస్ కస్టడీలో ఉన్నట్లు స్పష్టమైన సమాచారం అందిన నేపథ్యంలో..
వారిని వెంటనే విడిచిపెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు రష్యా పేర్కొంది. ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం తప విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని, చట్టబద్ధంగా ఎన్నికయిన అధ్యక్షుడిని, ఆయన భార్యను విడుదల చేయాలని పేర్కొంది. చైనా కూడా యూఎస్ చర్యను తీవ్రంగా ఖండించింది. ‘మరో సార్వభౌమ దేశంపై యూఎస్ ఇలా తమ బలాన్ని ప్రదర్శించి, ఆ దేశాధ్యక్షుడిపై చర్యలు తీసుకోవడం తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది’ అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. యూఎస్ ఇలా తమ ఆధిపత్యాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తోందని, అంతర్జాతీయ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించిందని మండిపడింది.

దక్షిణ అమెరికాలోని దేశాలైన చిలీ, బ్రెజిల్, క్యూబా తదితర దేశాలు ఈ సైనిక చర్యను తప్పుబట్టాయి. వెనిజులాపై యూఎస్ సైనిక చర్యను తాము ఖండిస్తున్నట్లు చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ ఫాంట్, క్యూబా విదేశాంగ మంత్రి బ్రూరో రోగ్రిగెజ్ పరీలా, బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిస్ ఇనాషియో లూలా డ సిల్వ తదితరులు ప్రకటించారు. ఈ చర్యతో అమెరికా దాటకూడని ఒక గీతను దాటేసిందని బ్రెజిల్ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై ఐక్యరాజ్య సమితి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో.. మిసైల్స్‌తో దాడులు చేశారని పేర్కొన్నారు. దీనిపై వెంటనే ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, యూఎన్ సమావేశమై స్పందించాలని డిమాండ్ చేశారు. యూఎస్ చర్యలను తీవ్రంగా ఖండించిన క్యూబా.. ఈ దాడులు ఆ దేశంపై చేసిన పిరికి చర్యలని, ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించని దేశంపై ఇలా దాడులు చేయడం ఏంటని నిలదీసింది. అయితే యూరప్ దేశాలు ఈ దాడులను ఖండించలేదు. కేవలం పరిస్థితిని గమనిస్తున్నామని, వెనిజులాలోని తమ పౌరులకు అడ్వైజరీలు జారీచేశాయి. ఇజ్రాయెల్ మాత్రం యూఎస్ చేసిన దాడులను స్వాగతించడం గమనార్హం.

Related posts

పాక్ బలూచిస్తాన్‌లో ఆ పోస్టు చేపట్టిన తొలి హిందూ మహిళగా రికార్డు… ఎవరీ కాశీష్ చౌదరి…?

M HANUMATH PRASAD

ఉగ్ర స్థావరాలు ధ్వంసం.. ఆ స్థానంలో మసీదుల పునర్నిర్మాణం

M HANUMATH PRASAD

జీతాలకు కూడా డబ్బుల్లేవ్.. చేతులెత్తేసిన యూనస్.. సంచలన ప్రకటన!

M HANUMATH PRASAD

4 నుంచి హజ్‌ యాత్ర.. ప్రకటించిన సౌదీ అరేబియా

M HANUMATH PRASAD

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు అంతర్జాతీయంగా ఘోర అవమానం..

M HANUMATH PRASAD

పాకిస్తాన్ మీద దాడికి దిగితే ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటాం బాంగ్లాదేశ్ ప్రభుత్వం హెచ్చరిక