వెనెజులాలో అమెరికా సైనిక చర్య ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. రాజధాని కరాకస్‌పై దాడి అనంతరం ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసి న్యూయార్క్‌కు తరలించారు
‘ఆపరేషన్ అబ్‌సొల్యూట్ రిసాల్వ్’గా దీనికి పేరు పెట్టింది అమెరికా. వెనెజులా ప్రస్తుతానికి తమ నియంత్రణలో ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామనీ పేర్కొన్నారు.
అమెరికా వైమానిక దాడుల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. కరాకస్‌లో కనీసం 40 మంది మరణించినట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. వెనెజులా ప్రభుత్వ అధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తెలిపింది. జనవరి 3న ఆరంభమైన ‘ఆపరేషన్ అబ్‌సొల్యూట్ రిసాల్వ్’లో భాగంగానే ఈ దాడులు జరిగాయని ఆ అధికారిని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఆపరేషన్ సమయంలోనే అమెరికా సైనికులు నికొలస్ మదురోను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తీసుకువచ్చిన ప్రత్యేక సైనిక విమానం న్యూయార్క్‌లోని స్టువర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్‌లో ల్యాండ్ అయింది. ఆ వెంటనే కట్టుదిట్టమైన భద్రత మధ్య మదురోను విమానం నుండి దించుతూ కనిపించారు సైనికులు. డజనుకు పైగా ఫెడరల్ ఏజెంట్లు ఆయనను చుట్టుముట్టారు. మొత్తం 30 మందికి పైగా అమెరికా ఏజెంట్లు రన్‌వేపై మోహరించారు.