Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

ఇద్దరు పండ్ల విక్రేతలు మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢకొీని ఇద్దరు పండ్ల విక్రేతలు దుర్మణం పాలైన ఘటన మండలంలోని శిరిగిరిపాడు శివారులో గురువారం జరిగింది.

ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మాచర్లకు చెందిన కరిముల్లా (50), నూర్జహాన్‌ (45) మాచర్లలోని అంబేద్కర్‌ సెంటర్‌లో తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తుంటారు. వీరు తమకు కావాల్సిన పండ్లను మార్కాపురంలో తెచ్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో గురువారం వీరిద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై మార్కాపురానికి వెళ్తున్నారు.

శిరిగిరిపాడు శివారులోకి వెళ్లగానే అదే గ్రామానికి చెందిన యువకుడు మరో ద్విచక్రవానంపై ఎదురుగుగా వచ్చి ఢకొీట్టాడు. దీంతో కరిముల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన నూర్జహాన్‌ను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కొద్దిసేపటికి మృతి చెందారు. ఢకొీట్టిన యువకునికి స్వల్ప గాయాలు కావడంతో గ్రామంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మృతురాలు నూర్జహాన్‌ మాచర్లకు చెందిన మహిళ కాగా ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరు హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. మరో మృతుడు కరిముల్లా సొంతూరు మార్కాపురం కాగా కొన్నేళ్ల కిందట మాచర్లకు వచ్చి ఉంటున్నట్లు తెలిసింది. వెల్దుర్తి ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

Related posts

పోలవరంపై సుప్రీంకోర్టు షాక్..!!

M HANUMATH PRASAD

తిరుపతిలో రైలు పైకి ఎక్కిన విద్యార్థి…విద్యుత్ తీగలు తగిలి షాక్‌తో మృతి

M HANUMATH PRASAD

టీడీపీలో ఉన్న వైసీపీ కోవర్టులు ఎవరు? ఖబర్దార్ అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చింది ఎవరికి..

M HANUMATH PRASAD

పని చేస్తే నే ఇంకొక సారి అవకాశం లేదంటే ఇంటికే -క్యాడర్ కి క్లాస్ పీకిన చంద్రబాబు

M HANUMATH PRASAD

ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు అవమానం

M HANUMATH PRASAD

తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా రోజుల తరువాత మంచి హిట్ మూవీ -నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

M HANUMATH PRASAD