Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

దేశం గజగజ వణికిపోవడం గ్యారెంటీ.. ప్లాన్ ప్రకారమే ఉస్మాన్ హదీని కరీం హత్య చేశాడా?

బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. భారత్కు వ్యతిరేకంగా గళం ఎత్తే తీవ్రవాద భావజాలం నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ(Usman Hadi) హత్య( murder) తో పూర్తిగా హింసాకాండంగా మారిపోయింది.
బంగ్లాదేశ్ ఢాకాలో షరీఫ్ ఉస్మాన్ హదీపై ఓ దుండగుడు పూర్తిగా ముసుగు ధరించి పట్టపగలే కాల్పలు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం సింగపూర్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈ హత్యకు ప్రధాన నిందితుడు ఫైసల్ కరీం అని పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్యకు కొన్ని గంటల ముందే ఫైసల్ కరీం తన స్నేహితురాలితో మాట్లాడుతూ, “రేపు దేశం మొత్తం గజగజ వణికిపోయేలా ఏదో జరగబోతోంది” అని చెప్పినట్లు దర్యాప్తులో తేలింది. కరీం తన స్నేహితుడితో చెప్పినట్లుగానే హదీ మరణం తర్వాత బంగ్లాదేశ్ మొత్తం హింసతో అట్టుడుకుతోంది. హదీ మరణవార్త తెలియగానే బంగ్లాదేశ్లో నిరసనలు మిన్నంటాయి.
ఉద్రిక్త పరిస్థితులకు కారణమిదే..

ఆందోళనకారులు మీడియా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు, చారిత్రక కట్టడాలపై దాడులు చేశారు. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ నివాసానికి కూడా నిప్పు పెట్టారు. దేశంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. 2026 ఫిబ్రవరిలో జరగనున్న సాధారణ ఎన్నికలకు ముందు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం ఆ దేశ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. ఎక్కువగా హిందువులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. మత విద్వేష ఆరోపణలతో ఒక హిందూ వ్యక్తిని అతి దారుణంగా కొట్టి, నిప్పు పెట్టి చంపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం శాంతిని నెలకొల్పడంలో విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Related posts

ఇండియాపై దాడికి నవాజ్ రూపకల్పన చేశారన్న అజ్మా బుఖారీ

M HANUMATH PRASAD

గ్రేటర్‌ బంగ్లాదేశ్‌ మ్యాప్‌లో భారత రాష్ర్టాలు!

M HANUMATH PRASAD

Balochistan Liberation Army: 56 మంది పాక్ సైనికులు మృతి

M HANUMATH PRASAD

ఆపరేషన్ సిందూర్‌పై కొలంబియా అభ్యంతరం.. స్పందించిన శశి థరూర్

M HANUMATH PRASAD

పాక్ లో సంబరాలు

M HANUMATH PRASAD

బంగ్లాదేశ్‌ షేక్‌ హసీనాకు బిగ్‌ షాక్‌

M HANUMATH PRASAD