దేశవ్యాప్తంగా విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు ఒక్కసారిగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇండిగో సర్వీసులు వందల సంఖ్యలో రద్దు అవుతున్నాయి.
కొన్ని సాంకేతిక కారణాలవల్ల ఇండిగో సర్వీసులు రద్దవుతున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ లైన్స్ కు సంబంధించిన కొత్త నిబంధనలను సిబ్బంది షెడ్యూలింగ్ ను సరిగ్గా ప్లాన్ చేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. అటు సిబ్బంది కొరత కూడా ఏర్పడినట్లు సమాచారం. అయితే దీని ప్రభావం ప్రయాణికులపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రయాణికులతో పాటు బిజినెస్ మ్యాన్లు, విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా రకాల పెళ్లిళ్లు కూడా ఆగిపోతున్నాయి. కొంతమంది ఆన్లైన్లో ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. IndiGo cancellations
అయితే ఈ ఇండిగో విమానాలు ఎక్కడికక్కడ రద్దు కావడంతో విమానాశ్రయాలం దగ్గర ప్రయాణికులు వేలాది సంఖ్యలో కనిపిస్తున్నారు. అయితే దీనిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గర ఉండి రివ్యూ చేస్తున్నారు. ఇండిగో సర్వీసులు ఆగిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటులకు రంగం సిద్ధం చేస్తున్నారు. సర్వీసులు రద్దయిన నేపథ్యంలో కొన్ని ప్రత్యేకంగా రైళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ఓ ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ నిర్వహించింది. ఇందులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరువు తీశాడు టిడిపి పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆ ఛానల్ యాంకర్, ఈ వివాదంపై టీడీపీ ప్రతినిధిని అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపై ఎలా ముందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. అయితే దీనికి సమాధానం చాలా డిఫరెంట్గా ఇచ్చారు టిడిపి అధికార ప్రతినిధి. అంతా నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారని.. ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారని టిడిపి అధికార ప్రతినిధి వెల్లడించారు. దీనిపై సదరు యాంకర్ పరువు తీశారు. నేను అడిగింది నారా లోకేష్ గురించి కాదు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గురించి అంటూ కౌంటర్ ఇచ్చారు. అయినప్పటికీ నారా లోకేష్ ఆధ్వర్యంలో అంతా జరుగుతుందని రామ్మోహన్ నాయుడు పరువు తీసే ప్రయత్నం చేశాడు సదరు టిడిపి నేత. దీనికి సంబంధించిన వీడియోలు వైసిపి దారుణంగా వాడేసుకుంటోంది. రామ్మోహన్ నాయుడు పరువు తీసేందుకు టిడిపి కుట్రలు చేస్తోందని వైసిపి కౌంటర్లు ఇస్తోంది. IndiGo cancellations
