Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

డీకేశికి బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, గట్టి చట్నీ పెట్టి డీల్ క్లోజ్ చేసిన సిద్ధు..!!

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య నెలకొన్న కుర్చీలాటను తెర దించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది.
హైకమాండ్ ఆదేశాల మేరకు కొద్దిసేపటి కిందటే డీకే శివకుమార్.. సిద్ధరామయ్య ఇంటికి వెళ్లారు. అక్కడే బ్రేక్ ఫాస్ట్ చేశారు. ముఖ్యమంత్రి పదవిపై వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదానికి ఈ అల్పాహార సమావేశంతో తెరపడినట్టేనని భావిస్తోన్నారు. డీల్ క్లోజ్ అయినట్లు చెబుతున్నారు.

కొద్దిసేపటి కిందటే డీకే శివకుమార్.. సిద్ధరామయ్య నివాసం కావేరికి చేరుకున్నారు. సుమారు 45 నిమిషాల పాటు ఆయనతో సమావేశం అయ్యారు. అనంతరం ఇద్దరు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీ, ఉప్మా, కేసరి బాత్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు విడుదల అయ్యాయి. ఇద్దరి మధ్య వివాదాలకు పుల్ స్టాప్ పడిందని, ఎప్పట్లాగే సత్సంబంధాలు కొనసాగుతున్నాయని పరోక్షంగా స్పష్టం చేసినట్టయింది.

తన నివాసం నుండి బయలుదేరే ముందు డీకేశి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రితో కలిసి అల్పాహారం చేయడానికి ఆయన ఇంటికి వెళ్తున్నానని తెలిపారు. భేటీ తర్వాత అందరితో మాట్లాడతానని వివరించారు. పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకున్న మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. అధిష్ఠానం సూచన మేరకు సిద్ధరామయ్య శనివారం శివకుమార్‌ను అల్పాహారానికి ఆహ్వానించారు.

పార్టీ అధిష్ఠానం తనతో పాటు శివకుమార్‌తో మాట్లాడిందని, ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలని, సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించిందని సిద్ధరామయ్య చెప్పారు. అందుకే ఆయనను అల్పాహారానికి ఆహ్వానించానని పేర్కొన్నారు. అన్ని విషయాలను ఇందులో చర్చించామని, త్వరలోనే వీటి గురించి అధిష్ఠానానికి వెల్లడిస్తానని అన్నారు. ఇందులో ఏం మాట్లాడామనేది ఆ తర్వాతే తెలియజేస్తానని సిద్ధరామయ్య అన్నారు.

ఈ బ్రేక్ ఫాస్ట్ భేటీ తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్ జాయింట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మార్పు విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పారు. అధిష్టానం చెప్పినదాన్ని అనుసరించాలని తాము నిర్ణయించుకున్నామని, నాయకత్వ మార్పు విషయంలో ఎటువంటి గందరగోళం ఉండదని అన్నారు. మీడియానే ఈ గందరగోళాన్ని సృష్టించారని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించే బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో ఎక్కువ సేపు చర్చించామని సిద్ధరామయ్య, డీకే వివకుమార్ పేర్కొన్నారు. తమ ఇద్దరి నాయకత్వానికి రాష్ట్ర ప్రజలు వారి పూర్తి మద్దతు ఇస్తోన్నారని, వారి కోరికలను నెరవేర్చుతున్నామని, ఆ దిశగా పని చేస్తున్నామని వివరించారు. హైకమాండ్ ఏమి చెప్పినా దాన్ని అనుసరిస్తానని, తాను సీఎంగా సిద్ధరామయ్యకు పూర్తి మద్దతు ఇస్తోన్నానని డీకే శివకుమార్ పునరుద్ఘాటించారు.

Related posts

కోల్‌కతాలో 150 మంది మాజీ టీచర్ల అరెస్ట్‌

M HANUMATH PRASAD

కర్రెగుట్టలో బారీ సంఖ్యలో మావోల మృతి

M HANUMATH PRASAD

వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులు వుంటారు!

M HANUMATH PRASAD

గురు దక్షిణగా పాక్ ఆక్రమిత కశ్మీర్ కావాలి’.. ఆధ్యాత్మిక గురువు సంచలన డిమాండ్.. ఆర్మీ చీఫ్ ఆన్సర్ ఇదే..

M HANUMATH PRASAD

రాహుల్ కు ఈసీ స్వీట్ వార్నింగ్

M HANUMATH PRASAD

వక్ఫ్​ సవరణ చట్టానికి రాజ్యాంగ బద్ధత ఉన్నట్టే : సీజేఐ

M HANUMATH PRASAD