Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

మంత్రిగా డబ్బులు రావట్లేదు.. సినిమాలే చేసుకుంటా : కేంద్రమంత్రి సురేశ్‌ గోపీ

కేంద్ర మంత్రి (Union Minister) సరేశ్‌ గోపీ (Suresh Gopi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పదవి నుంచి దిగిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇటీవలే కాలంలో తన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని.. అందుకే మంత్రిగా దిగిపోయి మళ్లీ సినిమాల్లో నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చారు.

మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 200కిపైగా చిత్రాల్లో నటించిన సురేశ్‌ గోపి 2016లో బీజేపీలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిస్సూర్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన సినీ జీవితాన్ని తిరిగి కొనసాగించాని భావిస్తున్నట్లు తెలిపారు.

‘సినీ కెరీర్‌ను వదిలిపెట్టి మంత్రి కావాలని నేను ఎన్నడూ కోరుకోలేదు. ఇటీవలే కాలంలో నా ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నా. మళ్లీ సినిమాల్లో నటించాలని అనుకుంటున్నా’ అని తెలిపారు. మరోవైపు తన స్థానంలో కేరళకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీ సదానందన్‌ మాస్టర్‌కు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించాలని బీజేపీ అధిష్టాన్ని కోరారు.

Related posts

బిహార్ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. కౌంటింగ్ ఎప్పుడంటే..?

M HANUMATH PRASAD

షాహి జామా మసీదు సర్వే పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

M HANUMATH PRASAD

రాహుల్ గాంధీ పరి పక్క్వత లేని వ్యక్తి-లక్ష్మణ్ సింగ్

M HANUMATH PRASAD

ఇండియాలో ఉండి లేకి పాక్ కు సపోర్ట్ చేసేవాళ్లు.. చూడాల్సిన వీడియో ఇది!

M HANUMATH PRASAD

ఢిల్లీ అల్లర్ల కేసు: వాట్సాప్ చాట్ లను సాక్ష్యాలుగా తీసుకోలేము

M HANUMATH PRASAD

నగల కోసం దహన సంస్కారాలను అడ్డుకున్న కొడుకు.. తల్లి చితిపై పడుకొని నిరసన

M HANUMATH PRASAD