Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

సుప్రీంకోర్టులో సీజేఐపై దాడికి యత్నం

సుప్రీంకోర్టులో ఈ రోజు ఉదయం కలకలం రేగింది. ఓ కేసు విచారణలో సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పై ఒక వ్యక్తి ఓ వస్తువును విసిరేందుకు ప్రయత్నించాడు.
కొంతమంది అది షూ అని చెప్పగా, మరికొంతమంది అది కాగితపు వస్తువులని అని చెప్పారు.

”సనాతన ధరమ్ కా అప్మాన్ నహి సహేగా హిందూస్తాన్”( సనాతన ధర్మం పట్ల అగౌరవాన్ని భారత్ సహించదు) అని నినాదాలు చేస్తున్న వ్యక్తిని భద్రతా సిబ్బంది త్వరగా తీసుకెళ్లారని తెలిసింది. ఆ వ్యక్తి న్యాయవాదీ కోటు వేసుకున్నాడు.నిర్ఘాంతపోయిన సీజేఐ..ఈ సంఘటన కాసేపు విచారణకు అంతరాయం కలిగించింది. తరువాత విచారణ కొనసాగించారు. అయితే ఈ సంఘటనపై సీజేఐ స్పందించలేదు. న్యాయవాదీని తన వాదనలు వినిపించమని కోరారు. ‘మీరు దృష్టి మరల్చకండి. దీనితో మేము దృష్టి మరల్చడం లేదు” అని లైవ్ లా నివేదించింది. సీజేఐ పై దాడి చేయడానికి ప్రయత్నించింది ఒక న్యాయవాదీ అని బార్ అండ్ బెంచ్ నివేదించింది. న్యాయవాదులు కేసుల ప్రస్తావనను సీజేఐ వింటున్నప్పుడూ ఈ సంఘటన జరిగిందని తెలియజేసింది. సదరు నిందితుడు సీజేఐ వేదిక వద్దకు వెళ్లి తన షూ తీసి సీజేఐ పైకి విసిరేందుకు ప్రయత్నించడాని వెల్లడించింది. కానీ భద్రతా సిబ్బంది వెంటనే నిందితుడిని పట్టుకున్నారు. తరువాత అతడిని బయటకు తీసుకున్నారు.సీజేఐ వివాదాస్పద వ్యాఖ్యలు..ఖజురహో లో ఏడు అడుగుల విష్ణువు శిరచ్ఛేదం జరిగిందని, విగ్రహానికి పునరుద్దరించడానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా పిటిషన్ దారుడిని వెళ్లి విష్ణువును అడగాలని వ్యంగ్యంగా వ్యాఖ్యనించారని ఆరోపణలు వచ్చాయి.”ఇప్పుడే వెళ్లి దేవుడిని ఏదైనా చేయమని అడగండి. మీరు విష్ణువు గొప్ప భక్తుడని అంటున్నారు. కాబట్టి ఇప్పుడే వెళ్లి ప్రార్థించండి. ఇది ఒక పురావస్తు ప్రదేశం దీనికి ఏఎస్ఐ అనుమతి ఇవ్వాలి” అని కేసును కొట్టివేశారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. చాలామంది సీజేఐ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. సంఘటన జరిగిన రెండురోజుల తరువాత తాను అగౌరవపరిచేలా మాట్లాడలేదని సీజేఐ వివరణ ఇచ్చారు.నేను అన్ని మతాలను సమానంగా చూస్తాను..”నేను అన్ని మతాలను గౌరవిస్తాను… ఇది సోషల్ మీడియాలో జరిగిందది” అని ఆయన అన్నారు. కేంద్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీజేఐకి మద్దతు పలికారు. సోషల్ మీడియాలో ప్రతిచర్యలు అతిగా మారతాయని అన్నారు.”మనం దీనిని మనం చూశాము. ప్రతిచర్యకు సమాన ప్రతిచర్య ఉంటుందని న్యూటన్ నియమం ఉంటుంది. కానీ ఇప్పుడూ ప్రతి చర్యకు అసమానమైన సోషల్ మీడియా ప్రతిచర్య ఉంది. మిలార్డ్” అని బార్ అండ్ బెంచ్ ఉటంకించినట్లు ఆయన అన్నారు.

Related posts

రాహుల్ గాంధీ పరి పక్క్వత లేని వ్యక్తి-లక్ష్మణ్ సింగ్

M HANUMATH PRASAD

కాంగ్రెస్ కు అధికారం కష్టమే: చిదంబరం

M HANUMATH PRASAD

దళితుల పట్ల కొనసాగుతున్న వివక్ష

M HANUMATH PRASAD

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్‌

M HANUMATH PRASAD

వారికి బెయిల్ ష్యూరిటీ ప్రభుత్వం చెల్లించాలి…: సుప్రీం కోర్టు

M HANUMATH PRASAD

కీలక పరిణామం.. జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

M HANUMATH PRASAD