Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

విశాఖలో పిడుగుపడి భారీ పేలుడు

విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. ఆదివారం మధ్యాహ్నం HPCL పరిధిలో ఉన్న EIPL ఎనర్జీ కంపెనీ పెట్రోలియం ట్యాంక్‌పై పిడుగు పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ మంటలు కాస్తా ఫ్యాక్టరీ పరిసరాల్లోకి వ్యాపించాయి. దీంతో కంపెనీ వద్ద భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన ఫ్యాక్టరీ సిబ్బంది వెంటనే అలర్ట్‌ అయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రమాద స్థలం పెట్రోలియం నిల్వ ఉండే ప్రాంతం కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

అదే సమయంలో ప్రమాద సమాచారం అందుకున్న HPCL, EIPL అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కంపెనీలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు చేపట్టారు. ఎవరైనా గాయపడితే వెంటనే హాస్పిటల్‌కు తరలించేందుకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు

Related posts

ఇంకేంత వ్యవసాయ భూమి కావాలి సార్

M HANUMATH PRASAD

ఏపీలో కొత్త రైల్వే లైన్‌.. ఈ రూట్‌లోనే, హైదరాబాద్ నుంచి తిరుపతి త్వరగా వెళ్లొచ్చు.. లైన్ క్లియర్

M HANUMATH PRASAD

హిందూ ధర్మం పై నిరంతర దాడులు- కూటమి ప్రభుత్వ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైస్సార్సీపీ నేత అంకంరెడ్డి నాగ నారాయణ మూర్తి

M HANUMATH PRASAD

సుప్రీంకోర్టు ముందు విడ్డూరపు నాటకం

M HANUMATH PRASAD

చంద్రబాబు కాలర్ ఎగరేస్తుంటే మీకు ధైర్యం రావడం లేదా?.. ఇందిరా పార్క్ ధర్నాలో కవిత హాట్ కామెంట్స్

M HANUMATH PRASAD

డిఎస్పీ వాయిదా వేయండి

M HANUMATH PRASAD