Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

టీ. వి. యాంకర్ ఆత్మ హత్య – అనుమానాలు?

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఛానల్లో న్యూస్ ప్రజెంటర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకు న్నారు. రామ్ నగర్లో తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న ఈమె, శుక్రవారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆత్మహ త్యకు కారణాలు తెలియలేదని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. స్వేచ్ఛప్రస్తుతం టీ న్యూస్ ఛానల్లో పని చేస్తున్నా రు. ఈ ఛానల్లో ఈ మధ్యే ఓ ఉద్యోగిని తనకు ఆఫీస్లో లైంగిక వేధింపులు ఎదుర వుతున్నాయని సోషల్ మీడియా ద్వారా వెల్ల డించినట్టు ప్రచారం జరుగుతున్నది. దీనిపై ఆఫీస్లోని పై స్థాయిలో ఉన్నవారికి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆరోపించిన ట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో అందులో యాంకర్ గా పని చేస్తున్న స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాల కు ఇవి తావిస్తున్నది. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Related posts

మల్లారెడ్డి వర్సెస్ అధికారులు.. మళ్లీ హైటెన్షన్

M HANUMATH PRASAD

హైదరాబాద్ లో లైవ్ సెక్స్ దందా కు చెక్ పెట్టిన పోలీసులు

M HANUMATH PRASAD

భద్రాచలం రామాలయంలో అపచారం.. సంచులపై అన్యమత ప్రచార స్లోగన్‌

M HANUMATH PRASAD

బాలునిపై కుక్కల దాడి.. కన్ను గుడ్డు ఊడిపడింది.. ఈ దారుణం చూశాకైనా కుక్కల ప్రేమికులు బుద్దితెచ్చుకోండి..

M HANUMATH PRASAD

సిద్దిపేట లో పోలీస్ రైడ్-అల్ఫ్రజోలం సీజ్

గృహప్రవేశం మరునాడే ఇల్లు కూల్చివేత

M HANUMATH PRASAD