Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్క్రీడా వార్తలు

ఇదికదా మ్యాచ్ అంటే.. నరాలు తెగే ఉత్కంఠ

మేజర్ క్రికెట్ లీగ్ -2025లో భాగంగా డాలస్ వేదికగా లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. నరాలు తెగేంత ఉత్కంఠతను రేపిన ఈ మ్యాచ్‌లో చివరికి వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టును విజయం వరించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. ఆండ్రీ ప్లెచర్ 60 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు బరిలోకి దిగింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ కేవలం 16 బంతుల్లోనే 43పరుగులు చేశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 42 పరుగులు చేశాడు.

వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు చివరి ఓవర్లో విజయానికి ఏడు పరుగులు కావాలి. క్రీజులో ఫిలిప్స్, ఓబస్ పియోనార్ ఉన్నారు. రస్సెల్ బౌలింగ్ మొదలు పెట్టాడు. తొలి బంతి వైడ్. ఆ తరువాత బంతిని పియోనార్ ఫోర్ కొట్టాడు. దీంతో ఐదు బంతుల్లో రెండు పరుగులు కావాలి. ఆ సమయంలో రస్సెల్ అద్భుత బౌలింగ్ తో నాలుగు బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఐదో బంతికి పియోనార్ సింగిల్ తీయడంతో మ్యాచ్ డ్రా అయింది. క్రీజలో గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు.

రస్సెల్ చివరి బంతిని ఫుల్ టాస్ వేయడంతో క్రీజులో ఉన్న ఫిలిప్స్ బంతిని మిడ్ -ఆన్ వైపు కొట్టాడు. బంతి నేరుగా జాసన్ హోల్డర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే, హోల్డర్ క్యాచ్ పట్టలేకపోయాడు. బంతి నేలపాలైంది. దీంతో ఫ్రీడమ్ జట్టుకు కావాల్సి ఒక్క పరుగు రావడంతో విజయం వరించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

తాగి రోడ్లపై తిరగండి.. పోలీసులు ఆపితే ఫోన్ చేయండి

M HANUMATH PRASAD

వారికి బెయిల్ ష్యూరిటీ ప్రభుత్వం చెల్లించాలి…: సుప్రీం కోర్టు

M HANUMATH PRASAD

గిట్ల ఆడినవ్ ఏంది కాకా..!!

గోబ్యాక్ జగన్ – తెనాలిలో ఎస్సి ల ధర్నా

M HANUMATH PRASAD

అసలైన లిక్కర్ దొంగ చంద్రబాబే

M HANUMATH PRASAD

ఏపీ లిక్కర్ స్కాంలో ముందడుగు, సునీల్ రెడ్డి నివాసంలో సోదాలు

M HANUMATH PRASAD