వివాహ బంధాలు దారుణ పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఒకరు ఇంకొకరితో వెళ్లిపోవడం వరకు ఉండగా.. ఇప్పుడు వారి పిల్లలను, భర్త, భార్యలను చంపుకుంటున్న రోజులు ఇవి
ఎప్పుడు ఎవరు ఏ విధంగా చేస్తారో అర్ధం కావడం లేదు. ముఖ్యంగా పెళ్లయిన కొత్త జంటలే దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో రాష్ట్రంలో అత్తా అల్లుడి కలిసి పారిపోయారు. కొత్తగా పెళ్లయిన అల్లుడిని బుట్టలో వేసుకున్న అత్త అతడితో వెళ్లిపోయింది. వీరిద్దరి మధ్య వయసు బేధం 30 ఏళ్లు ఉండడం గమనార్హం. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలోని దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకాలో మరవంజి గ్రామానికి చెందిన గణేశ్ (25)కు రెండు నెలల కిందట ముద్దెనహళ్లి గ్రామానికి చెందిన హేమతో వివాహమైంది. వివాహమైన అనంతరం పూజా కార్యక్రమాలు.. తీర్థ యాత్రలు వంటి ముగిసి నెల కిందట గణేశ్, హేమ తమ కాపురాన్ని ప్రారంభించారు. కాపురం మొదలుపెట్టిన కొన్నాళ్లకే భార్య హేమకు విస్తుగొలిపే విషయం తెలిసిందే. తన తల్లి శాంతతో వివాహేతర సంబంధం ఏర్పడిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యింది.
కుమార్తె హేమను గణేశ్‌కు ఇచ్చి శాంత దగ్గరుండి వివాహం జరిపించారు. ఇల్లరికంగా గణేశ్‌ను తన ఇంట్లోనే శాంత ఉండేలా చూసుకుంది. వివాహం జరిగిన 15 రోజుల తర్వాత గణేశ్ హేమ సవతి తల్లి శాంతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల గణేశ్ మొబైల్ ఫోన్‌కు శాంత అసభ్యకర సందేశం పంపింది. ఇది చూడడంతో హేమ నిలదీసింది. హేమ వెంటనే ఆ సందేశాలను తన తండ్రి నాగరాజ్‌కు పంపించింది. తమ విషయం ఇంట్లో వారికి తెలియడంతో శాంత వెంటనే ఇంట్లోని డబ్బు, నగలు దొంగిలించి అల్లుడు గణేశ్‌తో కలిసి పారిపోయింది.
పారిపోయే సమయంలో గణేశ్ తన భార్య హేమను బస్టాప్‌లో వదిలి పారిపోయాడు. హేమ వెంటనే చన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గణేశ్‌కు 25 ఏళ్లు ఉండగా.. అత్త శాంతకు 55 ఏళ్లు ఉన్నాయి. ఇద్దరి మధ్య 30 ఏళ్ల వయసు తేడా ఉన్నా కూడా వారి మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. అయితే వివాహానికి ముందే గణేశ్‌తో శాంతకు వివాహేతర సంబంధం కొనసాగుతోందని తెలుస్తోంది. అతడితో ఇంట్లోనే తమ బంధాన్ని కొనసాగించేందుకు పెద్ద కుమార్తె హేమను ఇచ్చి శాంత పెళ్లి చేసిందనే అంశం విస్తుగొలుపుతోంది. తన సుఖం కోసం కూతురిని ఎరగా వేసిందనే విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగిన విషయం తెలిసిందే. కొత్త అల్లుడితో కలిసి అత్త పారిపోవడం సమాజంలో చర్చనీయాంశంగా మారాయి.