Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రైమ్ వార్తలు

కాళ్లు పట్టుకున్నా వినలేదు కదరా.. బట్టలు చింపి.. హాకీ కర్రతో.. కోల్ కతా గ్యాంగ్ రేప్ పై బాధితురాలు..

కోల్‌ కతా విద్యార్థిని గ్యాంగ్ రేప్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కోల్ కతాలోని లా కాలేజీ క్యాంపస్ లో 24 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు మానవ మృగాలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

నిందితుల్లో ఒకరు బెంగాల్ లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేత కావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఇదే రాష్ట్రంలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడి పీజీ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.

కోల్ కతాలోని లా కాలేజీ క్యాంపస్ లో 24 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో అధికార టీఎంసీ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం నేతతో పాటు మరో ఇద్దరు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆమె ఫిర్యాదుతో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

తాను పెళ్లికి నిరాకరించడంతో మనోజిత్ మిశ్రా(31) కోపంతో రగిలిపోయి తనపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆమె అప్పటికే మరొకరితో ప్రేమలో ఉంది. ఈ క్రమంలో ఇద్దరినీ చంపేస్తానని మనోజిత్ బెదిరించినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ” నేను కాళ్లు పట్టుకుని బతిమాలాను. అయినా వినలేదు. బలవంతంగా గార్డు రూమ్ లోకి లాక్కెళ్లారు. బట్టలు చింపేసి నగ్నంగా ఉంచారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. కాళ్లు పట్టుకున్నా వినలేదు” అని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది.

సామూహిక అత్యాచారం చేస్తున్న సమయంలో ఈ దారుణాన్ని వీడియోలో చిత్రీకరించినట్లు బాధితురాలు తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియో పబ్లిక్ లో పెడతామని బెదిరించినట్లు ఆమె పేర్కొన్నారు. అత్యాచారం తర్వాత వాళ్ల నుంచి తప్పించుకునే క్రమంలో హాకీ కర్రతో కొట్టారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటన జూన్ 25 బుధవారం రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య జరిగినట్లు బాధితురాలు తెలిపారు.

ఈఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజిత్ మిశ్రా, అహ్మద్, ముఖర్జీలుగా గుర్తించారు. వారి మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

Related posts

ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితుడు..శ్రవణ్‌ రావు అరెస్టు

M HANUMATH PRASAD

ఆధార్ కార్డు వాట్సాప్‌లో పంపిస్తే చాలు.. ఏ డిగ్రీ సర్టిఫికేటైనా కొరియర్‌లో మీ ఇంటికి!

M HANUMATH PRASAD

మేము పోలీసులం… మీ ఇళ్లైనా సరే ఇంతే చేస్తాం?: మహిళపై పోలీసుల దౌర్జన్యం (

M HANUMATH PRASAD

బాలాపూర్లో దారుణం.. అనుమానంతో భార్యను చంపేసి భర్త పరార్..

M HANUMATH PRASAD

తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబం.. ఇంట్లోకి రానివ్వని యజమాని.. దిక్కులేక స్మశానంలో

M HANUMATH PRASAD

ఛీ.. ఛీ.. నడి రోడ్డు మీద యువతి పెదాలపై ముద్దులు.. వెలుగులోకి కామాంధుడి పైత్యం.. వీడియో వైరల్..

M HANUMATH PRASAD