Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

హైదరాబాద్ లో లైవ్ సెక్స్ దందా కు చెక్ పెట్టిన పోలీసులు

సడన్‌ ఎంట్రీతో పోలీసులు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. హైదరాబాద్ నడిబొడ్డున నడిచిన ఈ లైవ్‌ సెక్స్‌ దందా బాగోతంలోకి వెళ్తే..

నగరంలో లైవ్‌ సెక్స్‌ దందా వెలుగు చూసింది. అంబర్‌పేటలో ఓ జంట.. తమ శృంగార కార్యకలాపాలను ఆన్‌లైన్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో వ్యూయర్స్‌ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. స్వీటీ తెలుగు కపుల్ 2027 పేరుతో ఆన్‌లైన్‌లో ఈ జంట.. ఆ ప్రైవేట్‌ లింక్స్‌ను గత నాలుగు నెలలుగా పంచుతూ ఈ దందా నడిపిస్తోంది.

హాయ్‌.. ఫ్రెండ్స్‌. మా న్యూడ్‌ వీడియో కావాలా?. అయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్‌కు డబ్బులు కొట్టండి. లింక్‌ను షేర్‌ చేస్తాం అంటూ బూతు వీడియోలతో నెట్టింట రెచ్చిపోసాగింది. నగ్న వీడియోలతో పాటు తమ శృంగార వీడియోలను షేర్‌ చేస్తూ వచ్చింది. తాజాగా ఈ వ్యవహారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దృష్టికి చేరింది.

దీంతో అంబర్‌పేటలోని ఆ ఇంటిపై టాస్క్‌ఫోర్స్‌ టీం రైడ్‌ చేసింది. ఆ దంపతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ బూతు బాగోతం కోసం తాము ఉంటున్న ఇంటిపైన పరదాలతో ప్రత్యేక సెటప్‌ ఏర్పాటు చేశారు. అలాగే ఇంట్లో నుంచి కెమెరా, లైవ్ లింక్ పరికరాలు స్వాధీనపర్చుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ టీం ఈ దంపతులను అంబర్‌పేట పోలీసులకు అప్పగించగా.. వాళ్లు ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వాళ్ల వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Related posts

ప్రపంచ సంగీత దినోత్సవ కాంపిటీషన్ లో పాల్గొన్న చిరంజీవి అభినయ శివానంద

M HANUMATH PRASAD

జిల్లా ఇంచార్జి మంత్రుల పనితీరు బాగోలేదు -సీఎం రేవంత్ రెడ్డి

M HANUMATH PRASAD

మేము పోలీసులం… మీ ఇళ్లైనా సరే ఇంతే చేస్తాం?: మహిళపై పోలీసుల దౌర్జన్యం (

M HANUMATH PRASAD

దాదాపు ఐదేండ్లుగా జైలులోనే

M HANUMATH PRASAD

గూఢచారి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అసలేం చేసింది ?

M HANUMATH PRASAD

కూకట్ పల్లి లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

M HANUMATH PRASAD