ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో వివాహేతర సంబంధం ఘటన తెర మీదకు వచ్చింది.
యోగేష్ తివారీ (40)కి, సోని (30)తో 2010లో వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, కన్నౌజ్‌కు చెందిన వికాస్ ద్వివేది (35) అనే వ్యక్తితో సోనికి కొంతకాలంగా ఎఫైర్ నడుస్తుంది.
భర్త పలు మార్లు దీనిపై భార్యకు నచ్చ చెప్పాడు. కానీ ఆమె మాత్రం విన్పించుకోలేదు. ఈక్రమంలో ఇటీవల వీరి మధ్య గొడవలు పీక్స్ కు వెళ్లిపోయాయి. ఇటీవల సోని తన పుట్టింటికి వెళ్లి, సోమవారం తిరిగి భర్త ఇంటికి వచ్చింది. అదే రోజు వికాస్ కూడా వారి గ్రామానికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వికాస్‌ను గమనించిన యోగేష్.. అక్కడ కూడా ఇద్దరు కలుసుకున్నారా అంటూ గొడవలకు దిగాడు.
వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. గ్రామ పెద్దలతో పంచాయతీ ఏర్పాటు చేయించాడు.సోనీ తన ప్రియుడితో ఉండేందుకు ఇష్టపడుతు తన మనసులోని మాటను చెప్పింది. ఈ క్రమంలో యేగేష్ సైతం.. తన 15 ఏళ్ల బంధానికి బ్రేకప్ చెప్పేశాడు. అందరి ముందు.. తన భార్యకు, ఆమె ప్రియుడికి దగ్గరుండి మరీ పెళ్లి చేయించాడు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. నువ్వు గ్రేట్ భయ్యా.. కనీసం ప్రాణాలు అయిన మిగిలాయని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.మరికొంత మంది పోతే పోనీలే..నువ్వు హ్యాపీగా ఉండొచ్చని కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నారు.