దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోంఅంటూ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేతపవన్కళ్యాణ్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు తమిళ నటుడు సత్యరాజ్.మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తే.. తమిళనాడులో అది పనిచేయదని సత్యరాజ్ తెలిపారు.
మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తే.. తమిళనాడులో అది పనిచేయదని సత్యరాజ్ తెలిపాడు.
పవన్ కళ్యాణ్ ఇటీవల నాస్తికులు, సెక్యులరిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగన్ మానాడు సభకు హాజరైన పవన్. ఈ సభలో అధికార డీఎంకే పార్టీపై విమర్శలు గుప్పించడంతో పాటు హిందువులు సనాతాన ధర్మం అంటూ తన పాత రాగాన్ని మళ్లీ మొదలుపెట్టాడు. అంతేగాకుండా పవన్ మాట్లాడుతూ.. నాస్తికులకు ఏ దేవుడినీ నమ్మాల్సిన అవసరం లేదు, కానీ మన దేశంలో సమస్య ఏమిటంటే నాస్తికులు హిందువులను ఎంపిక చేసుకుని టార్గెట్ చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. అయితే పవన్ కళ్యాణ్ మతం పేరిటా తమిళనాడులో చిచ్చుపెట్టాలని చూస్తున్నాడని ఇప్పటికే పలు మంత్రులు ఆరోపించారు.
తాజాగా నటుడు సత్యరాజ్ కూడా పవన్ కామెంట్లపై స్పందిస్తూ.. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోం అంటూ పవన్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలను మీరు మోసం చేయలేరు. మురుగన్ సభతో మమ్మల్ని మోసం చేశారు అనుకుంటే అది మీ తెలివి తక్కువ తనమే అవుతుందని.. తమిళ ప్రజలు తెలివైనవారని తమిళనాట మీ ఆటలు సాగవని సత్యరాజ్ విమర్శించారు.