Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

మళ్లీ వైసీపీ రాదు. రానివ్వను.. పిచ్చి వేషాలేస్తే తొక్కినారా తీస్తా: పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది అంటూ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై అలాగే వైసిపి పార్టీ నేతల ప తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాలలో భాగంగా సినిమా డైలాగులు చెప్పడంతో ఈయన అభ్యంతరం వ్యక్తం చేశారు సినిమా డైలాగులు సినిమాల వరకే బాగుంటాయి కానీ వ్యక్తి జీవితంలో కాదని తెలిపారు.

ఇలా చంపుతాం నరుకుతామని చెబుతూ ప్రజలకు ఏం హితబోధ చేస్తున్నారని తెలిపారు.. గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నశించిపోయాయని అయితే గత ప్రభుత్వంలో చేసిన విధంగా ఇప్పుడు కూడా చేస్తాము అంటే కుదరదని పవన్ జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉందని ఆ విషయంలో సడలింపులు ఉండవని తెలిపారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎవ్వరైనా సరే తొక్కి నారా తీస్తా అంటూ ఈయన చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఇక వచ్చే ఎన్నికలలో అధికారం మాదే అంటూ వైసిపి కలలు కంటుంది. మరో 20 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలోకి ఉంటుందని వైసీపీని తిరిగి అధికారంలోకి రానివ్వను అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. సంస్కారం ఉంది కాబట్టే ఇలా మాట్లాడుతున్నామన్నారు. శాంతి భద్రతలు, అవినీతి రహితంగా ముందుకెళ్లాలని అధికారుల్ని పవన్ కోరారు.రోడ్లపైకి వచ్చి బ్యానర్లు పట్టుకుని గొంతుకలు కోస్తామని సినిమా డైలాగులు చెప్తే మక్కెలు విరగ్గొట్టి కూర్చుబెడతామన్నారు. తాము సరదాగా లేమని, చాలా దెబ్బలు తిని ఇక్కడికి వచ్చామన్నారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related posts

చంద్రబాబు కాలర్ ఎగరేస్తుంటే మీకు ధైర్యం రావడం లేదా?.. ఇందిరా పార్క్ ధర్నాలో కవిత హాట్ కామెంట్స్

M HANUMATH PRASAD

జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం : సీఎం చంద్రబాబు

M HANUMATH PRASAD

ఇంకేంత వ్యవసాయ భూమి కావాలి సార్

M HANUMATH PRASAD

జగన్ అరెస్టుకు నో చాన్స్?.. తెరవెనుక పెద్ద రాజకీయ వ్యూహం!

M HANUMATH PRASAD

మేము పోలీసులం… మీ ఇళ్లైనా సరే ఇంతే చేస్తాం?: మహిళపై పోలీసుల దౌర్జన్యం (

M HANUMATH PRASAD

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు

M HANUMATH PRASAD