వరల్డ్ మ్యూజిక్ డే ని పురస్కరించుకుని సుస్వర సంగీత వేదిక వాళ్ళు గ్లోబల్ ఆన్లైన్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు, వివిధ వయసులకు సంబందించినవారు 5-56 వయస్సు పైబడిన వారు కూడా పాల్గునే ఈ SSV., నిర్వహించే కాంపిటేషన్లో హైదరాబాద్ లంగారహౌజ్ ప్రాంతానికి చెందిన చిరంజీవి అభినయ శివనంద (8) జూనియర్ కేటగిరీ లో పాల్గొని గాంగేయ భూషిని రాగంలో ఒక అద్భుత కీర్తనని పాడడం జరిగింది. ఈ బాలుడు మహా విద్వాన్ శ్రీమతి పి. విజయలక్ష్మి గారికి స్వయానా మనవడు కావడం విశేషం.
తన నాన్నమ్మ అడుగు జాడలంలోనే బాల్యం నుంచి సంగీత సాధన చేస్తున్న ఈ చిన్నారి ప్రస్తుతం 3వ తరగతి చదువుతున్నాడు. చిన్నపటి నుంచి చదువులలో చలాకిగా ఉంటాడని, ఏక సంతాగ్రహీ తమ కుమారుడు అని, తను జూనియర్ విభాగంలో విజయం సాధిస్తాడని నమ్మకం తమకు ఉందని తల్లి తండ్రులు శ్రీ పి. ధరణి ధర్, శ్రీమతి కీర్తనలు తెలియ చేసారు.