సినిమా విడుదలై ప్రజాదరణ పొందిన సందర్భంగా, ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ పై తన మిత్రుడు, సన్నిహితుడు అయిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
“సునీల్ ఇంత మంచి హిట్ సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తరువాత మళ్ళీ ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగింది. సంక్షోభంలో ఉన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ‘కుబేర’ సినిమా ఒక ఊరట కల్పించింది,” అని ఆయన అన్నారు.
కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సినీ నిర్మాత, దర్శకుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మరియు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడిగా కూడా పని చేస్తున్నారు