GIT NEWS:
విద్యుత్ సమస్యల పరిస్కార వేదిక
విద్యుత్ పెండింగ్ సమస్యలు పరిష్కరానికి స్థానిక హంసవరం సెక్షన్ ఆఫీస్ ప్రాంగణం వీరవారపుపేట తుని నందు ది 19-06-2025 గురువారం ఉదయం 10:30 ని :నుండి మధ్యాహ్నం 1:30 నిముషాలు వరకు CGRF (కన్స్యూమర్ గ్రేవీన్స్ అండ్ రెడ్రెస్సల్ ఫోరమ్ )ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్, డా “బి. సత్యనారాయణ మూర్తి గారు తెలియజేసారు. విద్యుత్ సరఫరా లో అంతరాయలు, వొళ్టెజ్ సమస్యలు, బిల్ సమస్యలు, కొత్త కనెక్షన్ జారీ, తదితర సమస్యలను వినియోగదారులు నేరుగా తమ దృష్టికి తీసుకొని రావచ్చు అన్నారు. ఈ ప్రత్యేక సమావేశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.