Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

హిందువులు ఇలాగే తన్నులు తినాలా? -ఆర్మూర్ MLA ఫైర్

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో గురువారం రాత్రి రొయ్యల సురేష్ పై 40 మంది ముస్లింలు దాడి చేసిన ఘటనలో గాయపడిన రొయ్యల సురేష్ ను ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు.

దాడి జరిగిన వివరాలను బాధితుడు సురేష్, భార్య సౌమ్య లను అడిగి తెలుసుకున్నారు. 40 మంది ముస్లింలు కొట్టారని బాధితుడు సురేష్ ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం మోర్తాడ్ ఎస్సై తో ఆర్మూర్ ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. 40 మంది ముస్లింలు దాడి చేస్తే ఆరుగురు పై మాత్రమే కేసు ఎలా చేశావు, మిగతా వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు. సురేష్ కు మద్దతుగా గ్రామస్తులు భరోసా ర్యాలీ తీస్తామంటే కేసులు పెడతానని బెదిరించావట, శాంతియుతంగా ర్యాలీ తీస్తే తప్పేంటి, హిందువులు ఇలాగే తన్నులు తింటూ ఉండాల్నా, పదివేల మందిని తీసుకొచ్చి ర్యాలీ తీస్తా ఏం చేస్తావ్, ఈ దేశంలో హిందువులు బతికే స్వేచ్ఛ లేదా, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నావని మోర్తాడ్ ఎస్సై పై సెల్ ఫోన్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మండిపడ్డారు.నీపై డిజిపికి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మోర్తాడ్ ఎస్ఐ ని హెచ్చరించారు.

ఎమ్మెల్యే మాటలను రికార్డింగ్ చేసిన ఎస్సై..

మోర్తాడ్ ఎస్సైతో ఫోన్ లో మాట్లాడిన మాటలను రికార్డు చేస్తున్నట్టు చెప్పగానే, రికార్డు చెయ్యు నేనేమీ తప్పుగా మాట్లాడడం లేదు. నేను సీ పీ తో మాట్లాడతా, నీపై యాక్షన్ తీసుకునే విధంగా చేస్తానని ఎమ్మెల్యే ఎస్సైతో అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెంట ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, మాజీ పట్టణ అధ్యక్షుడు ధ్యాగ ఉదయ్, కలిగోట్ గంగాధర్ తదితరులు ఉన్నారు.

Related posts

ప్రపంచ సంగీత దినోత్సవ కాంపిటీషన్ లో పాల్గొన్న చిరంజీవి అభినయ శివానంద

M HANUMATH PRASAD

రేపటి నుంచి స్లాట్ బుకింగ్

M HANUMATH PRASAD

రాజ్ తరుణ్ కు ఇల్లు అప్పగించాల్సిందే – లావణ్యకు హై కోర్ట్ బిగ్ షాక్

M HANUMATH PRASAD

గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..రోడ్డున పడ్డ 200 మంది ఉద్యోగులు

M HANUMATH PRASAD

సిద్దిపేట లో పోలీస్ రైడ్-అల్ఫ్రజోలం సీజ్

ఏపీ సీఎం కు తెలంగాణ సీఎం చురకలు

M HANUMATH PRASAD