కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఎన్నికల సంఘం(Election Commission) సీరియస్ అయింది. మహారాష్ట్ర ఎన్నికల(Maharashtra Assembly Elections)పై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఖండించింది.
అవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అని పేర్కొంది. అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. కాగా, మహారాష్ట్రలో ఓటర్ల జాబితాను తారుమారు చేశారని రాహుల్ ఆరోపించారు.
ఐదు నెలల్లో కొత్తగా 70 లక్షల ఓటర్లను చేర్చారని అన్నారు. షిర్డీలో ఒకే భవన్‌లో 7000 మంది ఓటర్లను చూపించారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భారీ సంఖ్యలో పెరిగాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఓటర్ల డేటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.