Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం : సీఎం చంద్రబాబు

జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పథకలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కూడా ఈ నెలలోనే అమలు చేస్తామని సీఎం క్లారీటీ ఇచ్చారు. పంద్రాస్ట్ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు వివరించారు.

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చామని.. వీటి ద్వారా 4.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. 2027కి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని..

అలాగే రాజధాని అమరావతి నిర్మాణం కూడా వేగంగా జరువుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని.. ఈ క్రమంలోనే విశాఖ స్టేల్ ప్లాంట్‌కు రూ.11,400 కోట్ల ప్యాకేజీ, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతోందని చంద్రబాబు పార్టీ శ్రేణులకు తెలిపారు.

Related posts

2024లో బీజేపీతో కలిసి వెళ్లకుండా పెద్ద తప్పు చేశాం – వైసీపీ మాజీ MLA

M HANUMATH PRASAD

ప్రీపెయిడ్ మీటర్లు వచ్చేస్తున్నాయ్..ఇక ముట్టుకుంటే షాక్.. నెలవారీ బిల్లు చూస్తే ఇక అంతే?

తిరుపతిలో రైలు పైకి ఎక్కిన విద్యార్థి…విద్యుత్ తీగలు తగిలి షాక్‌తో మృతి

M HANUMATH PRASAD

తప్పుడు కేసా.. కాదా అన్నది మేము తేలుస్తాం

M HANUMATH PRASAD

ఏపీలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ… రాయపాటి శైలజ, పీతల సుజాత, హరి ప్రసాద్‌, తదితరులకు పదవులు… పూర్తి జాబితా ఇదే…

M HANUMATH PRASAD

ఇంకేంత వ్యవసాయ భూమి కావాలి సార్

M HANUMATH PRASAD