కూసుమంచి మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో ఖబరస్థాన్ (ముస్లింల స్మశాన వాటిక) స్థలాన్ని ఆక్రమించారని శనివారం ముస్లింలు నిరసన తెలిపారు.
బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థన అనంతరం సమాధుల వద్ద నివాళులు అర్పించడానికి వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ముస్లింలు మాట్లాడుతూ గత రెండు వందల సంవత్సరాలుగా చౌటపల్లి , పోచారం గ్రామాలకు చెందిన ముస్లింలు మృతి చెందిన వారిని ఇక్కడే ఖననం చేస్తూ వస్తున్నారు అని తెలిపారు. ఖబరస్థాన్ పక్కనే ఉన్న భూ యజమాని ఆక్రమించి సమాధులను జెసిబి లతో ధ్వంసం చేసి ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆక్రమించిన స్థలానికి ఫెన్సింగ్ కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
వెంటనే ఆక్రమణలను తొలగించి స్థలం సరిహద్దులు గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని ముస్లింలు కోరారు. ఆక్రమణలు తొలగించి చర్యలు తీసుకోవాలని సీపీఎం గ్రామ కార్యదర్శి కందాల.సుందర్ డిమాండ్ చేశారు.ఈ విషయంపై స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి విన్నవించునున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్లింలు మస్తాన్ ,మహమూద్, మీరా పాషా, ఖాజా పాషా ,జాన్ పాషా, అబ్దుల్ ఘని ,పాషా, అల్తాఫ్ ,జాఫర్, రషీద్, జహంగీర్ అలీ , ఖాసీం అలీ, నసీరుద్దీన్, నయీమ్ పాషా , ఖాదర్ పాషా ,తదితరులు పాల్గొన్నారు.