Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

పని చేస్తే నే ఇంకొక సారి అవకాశం లేదంటే ఇంటికే -క్యాడర్ కి క్లాస్ పీకిన చంద్రబాబు

రాష్ట్రాభివృద్ధిలో ఏడాది కాలంలో స్పష్టమైన మార్పు చూపించినట్లు సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. తెదేపా నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ”పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నాం. బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహం ఉంటుంది. పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటాం. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలి. ప్రజలు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలి. వన్‌టైమ్‌ ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదనేది నా ఆలోచన. ప్రజలు అన్నీ గమనిస్తారు.. జాగ్రత్తగా ఉండాలి

గత ప్రభుత్వంలో రాష్ట్రమంతా నిరాశ, నిస్పృహ, చీకటి అలముకుంది. భయంకర పరిస్థితులను రాష్ట్ర ప్రజలు చూశారు. రాష్ట్రం పేరు వింటేనే దగ్గరకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. అసమర్థ పాలనతో ఏపీని ఆర్థికంగా పాతాళానికి తొక్కేశారు. మనం తీసుకునే నిర్ణయాలతోనే మంచి ఫలితాలు వస్తున్నాయి. గత ప్రభుత్వాన్ని భరించలేకే ప్రజలు ఏకపక్షంగా మనల్ని గెలిపించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు, నివేదికలు ఉంటాయి. మంచి చేస్తే అభినందిస్తా.. తప్పు చేస్తే దూరం పెడతా. త్వరలోనే ఒక్కో ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తా. ఎవరు ఎంత అడ్డుపడినా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదు. ఈ నెల 12 లేదా 14 లోపే తల్లికి వందనం నగదు తల్లులకు అందిస్తాం” చంద్రబాబు తెలిపారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో ఏడాది పాలనపై 12న నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు చేయాలని నిర్ణయించారు. అదే రోజున సాయంత్రం ఎన్డీయే పక్షాలు, అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే నాలుగేళ్లలో చేపట్టే కార్యక్రమాలపై ఇక్కడ చర్చించనున్నారు.

Related posts

AP లిక్కర్ కేసులో సంచలన విషయాలు.. సినిమా రేంజ్‌లో నెక్ట్స్ లెవెల్‌లో జగన్ కుంభకోణం

M HANUMATH PRASAD

మహానాడుకు వెళ్తూ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన లోకేష్.. కార్యకర్త భావోద్వేగం

M HANUMATH PRASAD

తుని లయన్స్ క్లబ్ నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకారం

M HANUMATH PRASAD

Borugadda Anil Bail: బోరుగడ్డకు బెయిల్‌

M HANUMATH PRASAD

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో కే ఏ పాల్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ హై కోర్టు

కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’

M HANUMATH PRASAD