Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, సీఎంలకు తాకుతుంది: రాజా సింగ్


బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, వారి కుటుంబానికి తాకుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

వ్యవసాయానికి పనికివచ్చే ఆవులను, ఎద్దులను చంపడం పాపం అని అన్నారు. వాటిని చంపినవారికి ఎంత పాపం తగులుతుందో అంతే పాపం భారతదేశంలోని ప్రతి ఎంపీకి తాకుతుందని చెప్పారు. వాళ్ల కుటుంబ సభ్యులకు తరతరాలకు తగులుతుందని చెప్పారు. గోవదను నిషేదించాలని పార్లమెంట్‌లో ఎందుకు బిల్ వేయడం లేదని ప్రశ్నించారు.

గతంలో కొంతమంది ప్రైవేటు బిల్ వేసినప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదో ఆలోచించాలని అన్నారు. గోవులను చంపి తిన్నవారికే కాకుండా నోరు మూసుకుని ఉన్న ఎంపీలకు, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి తాకుతుందని చెప్పారు. ఇలాంటి పాపానికి గురికావద్దంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో గోవదను నిషేదించాలని బిల్ తీసుకురావాలని చెప్పారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గోవదను అడ్డుకోకుండా రెండు మూడు రోజుల నుండి తమను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు.

Related posts

150 కోట్లు స్వాహా చేసిన సెక్యూరిటీ సంస్థ

M HANUMATH PRASAD

మాలో ఎవరికి ఇచ్చిన పర్లేదు.. కేబినెట్ విస్తరణపై సీఎంకి మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేల రిక్వెస్ట్

M HANUMATH PRASAD

రేపటి నుంచి స్లాట్ బుకింగ్

M HANUMATH PRASAD

ఏపీ సీఎం కు తెలంగాణ సీఎం చురకలు

M HANUMATH PRASAD

వాహనాలు తనిఖీచేస్తే కఠిన చర్యలు- DGP జితేందర్

M HANUMATH PRASAD

చౌటపల్లిలో ఖబరస్థాన్ ఆక్రమణ.. మనోభావాలు దెబ్బతిన్నాయని ముస్లింల నిరసన

M HANUMATH PRASAD