Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు కాలర్ ఎగరేస్తుంటే మీకు ధైర్యం రావడం లేదా?.. ఇందిరా పార్క్ ధర్నాలో కవిత హాట్ కామెంట్స్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తోందని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన కమిషన్ ఈ ప్రాజెక్టు కోసం 90 శాతం పంప్ హౌస్ లు కట్టిన మెఘా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రశ్నించారు.

కేవలం కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని ఆయనకు నోటీసులు ఇచ్చారని నీళ్లు తీసుకురావడం ఆయన చేసిన తప్పా? తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడం తప్పా అని నిలదీశారు. ఇవాళ తెలంగాణ జాగృతి (Telangana Jagruti) ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో మాట్లాడిన కవిత.. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలేనా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వేసిన కమిషన్ కాళేశ్వరం కమిషన్ కాదని అది కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు. కేసీఆర్ కాబట్టి కాళేశ్వరం లాంటి మల్టీలెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆలోచన చేశారని అదే కాంగ్రెస్ ఇటువంటి ప్రాజెక్టును ఏనాడైనా ఆలోచన చేసిందా అని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో తెలంగాణకు కేవలం 16 టీఎంసీలు మాత్రమే వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే దాన్ని కేసీఆర్ మార్చి 141 టీఎంసీలకు పెంచారని చెప్పారు. కాళేశ్వరంతో కేసీఆర్ కు పేరు వస్తుందని ఆయన్ను బద్నాం చేయడానికి కుట్ర చేస్తోందన్నారు. నీళ్లిచ్చిన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే ఇది నిజంగా సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులారా కబర్దార్ అని హెచ్చరించారు.

గోదావరి నుంచి 200 టీఎంసీల నీళ్లను బనకచర్ల ప్రాజెక్టుకు ఎత్తుకుపోతానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naiuda) కాలర్ ఎగరేసి చెబుతుంటే దీన్ని అడ్డుకునేలా లేఖ రాయడానికి సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఎందుకు ధైర్యం రావడం లేదని ప్రశ్నించారు. అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని ఎందుకు అడగడం లేదన్నారు. బనకచర్లను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. తుపాకుల గూడెం వద్దే లింకేజ్ పాయింట్ ఉండాలని తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ మౌనంగా ఉందన్నారు. చంద్రబాబుపై ఆధారపడే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని అందువల్లే చంద్రబాబు తెలంగాణ జల దోపిడి చేస్తున్నా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. బీజేపీలో ఈటల రాజేందర్ అన్న ఒక్కరే తెలంగాణ బిడ్డ ఉన్నారు. ఆయన సైతం మాట్లాడం లేదన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నారన్న అపవాదు ఈటల అన్న తెచ్చుకోవద్దన్నారు. గోదావరి, పెన్నా లింకేజ్ పాయింట్ తుపాకుల గూడెం వద్దనుంచే ఉండేలా ఈటల రాజేందర్ ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలన్నారు. తెలంగాణకు నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ చర్యలు తీసుకోకపోతే తెలంగాణ జాగృతి తరఫున కార్యాచరణ తీసుకుంటామన్నారు.

ఉర్దూలో స్పీచ్:

ఈ సందర్భంగా కవిత తన స్పీచ్ ను కాసేపు ఉర్దులో కొనసాగించడం ఆసక్తిగా మారింది. ఎల్కతుర్తి సభలో ఉర్దులో కేసీఆర్ మాట్లాడకపోవడాన్ని, బీజేపీపై విమర్శలు చేయకపోవడాన్ని కవిత తన లేఖలో కీలకంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇవాళ్టి మీటింగ్ లో కవిత ఉర్దులో మాట్లాడటంతో పాటు బీజేపీపై విమర్శలు గుప్పించారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా తెలంగాణకు 8 రూపాయలు నిధులు తేలేకపోయారని ఆమె విమర్శలు చేసారు

Related posts

గోబ్యాక్ జగన్ – తెనాలిలో ఎస్సి ల ధర్నా

M HANUMATH PRASAD

కూటమికి షాక్, 30 మంది వైసీపీలో చేరిక

కూటమి సభలో ఎమ్మెల్యేలకు అవమానం..! బయటకొచ్చేసే వాడిని- రఘురామ షాకింగ్

M HANUMATH PRASAD

తుని మూగ జీవాల ఆశ్రమం పై దాడి ఘటనలో కుట్ర కోణం?

M HANUMATH PRASAD

మంగుళూరులో హిందూ కార్యకర్త దారుణ హత్య

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో కే ఏ పాల్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ హై కోర్టు