Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

మాజీమంత్రి బొత్సకు అస్వస్థత

వైసీపీ నేత (YCP Leader), మాజీమంత్రి బొత్స సత్యనారాయణ (Ex Minister Botsa Satyanarayana) అస్వస్థతకు గురయ్యారు. (health scare) వైఎస్ జగన్ (YS Jagan) పిలుపు మేరకు బుధవారం చీపురుపల్లి (Cheepurupalli)లో వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

వేదికపై ఉండగా వడ దెబ్బతో సొమ్మసిల్లిపోయారు. దీంతో అక్కడున్న నేతలు హుటాహుటిన బొత్సను ఆసుపత్రికి తరలించారు.

ఊహించని షాక్…

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఊహించని షాక్ తగిలింది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరుతో.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కూడా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో బొత్స ప్రసంగం చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే గమనించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయనను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. వడదెబ్బ కారణంగా ఆయన కిందపడిపోయారని చెబుతున్నారు.. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

కాలినడకన ర్యాలీ..

అంతకు ముందు చీపురుపల్లిలోని స్థానిక కొత్త పెట్రోల్ బంక్ నుంచి సుమారు కిలోమీటరన్నర వరకు ఎండలోనే ర్యాలీని నిర్వహించారు. వైసీపీ నేతలు, బొత్స సత్యనారాయణ కాలినడకన మూడు రోడ్లు జంక్షన్ వరకు నడిచారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రచార వాహనంపైకి ఎక్కి మాట్లాడుతుండగా ఒక్కసారిగా బొత్స సత్యనారాయణ కుప్పకూలిపోయారు.

కాగా ఏపీలో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. సూపర్‌ సిక్స్‌ సహా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ వైసీపీ నిరసనకు దిగింది. గత ఏడాది ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన జూన్‌ 4ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం పేరుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు.. భారీగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Related posts

ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా: బండారు

M HANUMATH PRASAD

ఇక తప్పు చేస్తే పీడీ యాక్టే – పోలీసులు ఏ చర్య తీసుకున్న ఓకే -సీఎం చంద్రబాబు.

M HANUMATH PRASAD

వైయస్ షర్మిల నిరాహార దీక్ష

M HANUMATH PRASAD

Chandrababu vindictive; arrests with ulterior motives*

M HANUMATH PRASAD

మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి కి సుప్రీమ్ కోర్టు బిగ్ రిలీఫ్

M HANUMATH PRASAD

ఇస్లాం నమ్మకాలకు అనుగుణంగానే పాక్ ఆపరేషన్‌కు ఆపేరు..

M HANUMATH PRASAD