Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

కూకట్ పల్లి లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయింది.

ఏపీ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నిందితుల నుంచి కోటి రూపాయల విలువైన 840గ్రాముల కొకైన్‌, ఎపిడ్రిన్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఐదు మొబైల్స్‌, 50 వేల నగదు సీజ్‌ చేశారు. ఇక.. నిందితుల్లో ఒకరు తిరుపతి చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్ ఉన్నట్లు గుర్తించారు.

దాంతో.. కానిస్టేబుల్ గుణశేఖర్‌తో పాటు.. పరారీలో ఉన్న బెంగళూరుకు చెందిన అప్పన్న కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ డ్రగ్స్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌పై కీలక విషయాలు వెల్లడించారు మేడ్చల్‌ డీసీపీ కోటిరెడ్డి. తిరుపతిలో ప్రారంభమైన డ్రగ్స్‌ ముఠా దందా.. గుంటూరు నుంచి హైదరాబాద్‌ మీదుగా కొనసాగుతున్నట్లు తెలిపారు.

పరారీలో ఉన్న ఇద్దరి కోసం రెండు టీమ్‌లను తిరుపతి, బెంగళూరుకు పంపుతున్నామన్నారు.

అరెస్టయిన వారంతా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారేననని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒక మహిళను కూడా అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో పోలీసు ఉద్యోగంలో ఉన్న వ్యక్తి పట్టుబడటం ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Related posts

అగ్నిప్రమాదంలో మృతులు వీరే

M HANUMATH PRASAD

డీఎస్పీ గా అవతారమెత్తిన కేటుగాడు అరెస్ట్

M HANUMATH PRASAD

హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్ర భగ్నం..

M HANUMATH PRASAD

ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ..

M HANUMATH PRASAD

ప్రకటిత నేరస్థుడిగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌!

M HANUMATH PRASAD

టీ. వి. యాంకర్ ఆత్మ హత్య – అనుమానాలు?

M HANUMATH PRASAD