గొషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళహాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒంటరిగా బయటకు రావద్దంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది, బుల్లెట్ ప్రూఫ్ కారు లేకుండా బయటకు రావద్దని, ఒంటరిగా ఎట్టిపరిస్థితుల్లోనూ తిరగవద్దని పోలీసులు తెలిపారు.
రాజాసింగ్ కు తరచూ బెదిరింపు కాల్స్ రావడంతో ఈ మేరకు మంగళహాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాజాసింగ్ తరచూ ఒంటరిగా బయటకు వెళుతుండటంతో పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
సున్నితమైన ప్రాంతాల్లో…సున్నితమైన ప్రాంతాల్లో ఒంటరిగా తిరగడం వల్ల ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. జిర్రా, గోల్కొండ, యాకుత్ పుర, సంతోష్ నగర్, బహదూర్ పుర, బాబా నగర్, ఇంజబోలి, భవానీ నగర్, తలాబ్ కట్ట ప్రాంతాలకు భద్రతా సిబ్బంది లేకుండా బయటకు వెళ్లడం గమనించిన పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. తమకు సమాచారం అందించకుండా బయట ప్రాంతాలకు కాని, నియోజకవర్గ పర్యటనకు కాని వెళ్లవద్దని సూచించారు.