ఈ ప్రపంచంలో ఎన్నో చిత్ర విచిత్రాలు ఉంటాయి. కొన్ని సాధారణంగా కనిపిస్తాయి, మరికొన్ని అసాధారణంగా కనిపిస్తాయి. తన స్వార్ధమే జీవితంగా బతికే వ్యక్తులు ఉంటారు, అలాగే తన జీవితం నలుగురికి ఉపయోగ పడేలా బతికే త్యాగ ధనులు ఉన్నారు. స్వార్ధమే పరమావధిగా భావించి నమ్మిన వారిని నట్టేట ముంచే వారున్న ఈ సమాజంలో, తాను నమిన్న, తనను నమ్ముకున్న మూగ జీవాల కోసం సర్వం వదిలేసి మూగ జీవాల సేవలో సేద దీరుతున్న మహనీయుడు శ్రీ గొల్లపల్లి వీరబాబు గారు,
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా తునికి చెందిన శ్రీ గొల్లపల్లి వీరబాబు గారు చిన్నపటినుంచి మూగ జీవాల పట్ల అందులోను కాల భైరవ స్వరూపమైన కుక్కల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ, వాటి బాగోగుల కోసం దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఒక ఆశ్రమాన్నే నిర్మించిన వ్యక్తి శ్రీ వీరబాబు గారు. తుని పరిసర ప్రాంతాలలో స్ట్రీట్ డాగ్స్ కి అపద వస్తే తక్షణం అక్కడ ప్రత్యక్ష మవుతారు. తరచూ స్ట్రీట్ డాగ్స్ ప్రమాధాలకు గురి అవుతు ఉంటాయి ఈ సమాచారం అందిన వెంటనే వీరబాబు అక్కడకు చేరుకొని దగ్గరలోని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకు వచ్చి చికిత్స చేయించి తను నిర్మించిన ఆశ్రమంలో ఉంచుతారు. తుని ఉరి చివరన ఉన్న శ్రీ వీరబాబు గారి ఆశ్రమంలో ఇలాంటి స్ట్రీట్ డాగ్స్ ప్రస్తుతం 100 కు పైగానే ఉన్నాయి. ఇలా రోజు ఆక్సిడెంట్ ల ద్వారా గాయల బారిన పడిన స్ట్రీట్ డాగ్స్ ని ఆసుపత్రి కి తీసుకు వెళుతుఉండటంతో వాటికి వైద్యం చేయడానికి అక్కడ సిబ్బంది కొంత అసహనం ప్రదర్శించడంతో నొచ్చుకున్న వీర బాబు గారు తానే స్వయంగా చికిత్స చేస్తూ తక్షణ ఉపశమనం కల్గిస్తూ ఎన్నో ప్రాణాలు కాపాడారు.ఎపుడు తనతోపాటే తన స్కూటర్ లో ఇంజెక్షన్స్, సైలోన్ బాటిల్స్, పౌడర్లు, ఆయింట్మెంట్ లు తీసుకుని ప్రయాణం చేస్తూ ఎక్కడ స్ట్రీట్ డాగ్స్ ఆక్సిడెంట్ లకు గురి అయితే అక్కడ ప్రత్యక్ష మయ్యి, అక్కడికక్కడే తానే స్వయంగా వైద్యం చేసి ప్రాణాలు నిలిపిన తరువాత ఆశ్రమంలో నివాసం కలిపిస్తారు.
మూగ జీవలతో మమేకమై బ్రతికే ఈ వ్యక్తి వాటి కోసం తన సర్వస్వం కోల్పోయారు, వాటికోసం ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినా వదులుకున్నారు, ఇప్పుడు తనకంటూ ఏమి లేదు, వయసు మీద పడుతున్న తన ఆశ్రమం లోని మూగ జీవాళ్లకోసం నిత్యం కష్టపడుతూ వాటిని పోసిస్తున్నారు, ఒక్కోసారి వాటి నిర్వహన భారంగా అనిపించినా అప్పో సోప్పో చేసైనా వాటిని పోసిస్తున్నారు.
ఈ జంతు ప్రేమికుడిని GIT న్యూస్ కలసి మాట్లాడినపుడు తన తదనంతరం మూగ జీవాల బాగోగుల గురించి ఎవరు చూస్తారో అనే వేదన వారి మాటలలో వ్యక్తం చేశారు. వాటి పోషణ ఒక్కొక్కసారి తలకు మించిన భారం అవుతుందని, అప్పుడపుడు కొంతమంది మిత్రులు పాలు,బిస్కట్ లు ఇస్తూ ఉంటారని, కానీ ప్రభుత్వనుంచి ఏవిధమైన సహాయ సహకారలు అందటం లేదని, రోజు రోజుకి చాలా కుక్కలు ఆశ్రమానికి చేరుకుంటున్నాయని, కొంతమంది కుక్కలను పెంచుకుంటున్న యజమానులు వాటిని పెంచడం భారం అనుకున్నప్పుడు ఇక్కడకు తీసుకు వచ్చి వదిలిపెడుతునారని, తన ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం గా ఉందని, ఇప్పటికే తను తిన్నా తినకపోయినా అప్పులు చేసైనా వాటినిపోషిస్తువున్నానని భవిష్యత్తు ఏ విదంగా ఉంటుందో అర్ధం కావడం లేదని, జంతు ప్రేమికులు, ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని అయన అన్నారు.