సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మళ్లీ నోరు జారాడు. ఈ నడుమ స్టేజిపై మాట్లాడుతూ కంట్రోల్ తప్పుతున్నాడు. ఎవరిని పడితే వారిని అందరి ముందే బూతులు తిట్టేస్తున్నాడు.
మొన్న రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్ లో ఏకంగా డేవిడ్ వార్నర్ ను పట్టుకుని దొంగ ముం* కొడుకు అంటూ తిట్టేశాడు. అందరూ తిట్టేసరికి క్షమాపణ చెప్పాడు. అంత రచ్చ జరిగినా సరే తన తీరు మార్చుకోవట్లేదు. మళ్లీ నోరు జారాడు. ఈ సారి స్టార్ కమెడియన్ అలీని పట్టుకుని బూతు మాట అనేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా చేశారు. ఈ వేడుకకు ఆయన సినిమాలో నటించిన అలనాటి హీరోలు వచ్చారు. ఈవెంట్ లో నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘మీరంత మంది వస్తున్నారని నాకు తెలియదు.. ఏరా అచ్చెన్న నీ సంగతి బయటకు వెళ్లాక చెబుతాను. అలీ గాడు ఎక్కడున్నాడు లం* కొడుకు.. మాకు ఇదంతా కామన్.. నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్లాను. ఏంటీ చప్పట్లు కొట్టట్లేదు. బ్రెయిన్ లేదా మీకు’ అంటూ దురుసగా మాట్లాడాడు రాజేంద్ర ప్రసాద్. ఈ వీడియో ఇప్పుడు కాంట్రవర్సీ అవుతోంది. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిసారి ఇలా మాట్లాడటంతో రాజేంద్ర ప్రసాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. నటుడిగా ఎంతో కీర్తి సంపాదించుకున్న ఆయన.. స్టేజిపై మాట్లాడేటప్పుడు కంట్రోల్ తప్పుతూ వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు.