Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

రేపటి నుంచి స్లాట్ బుకింగ్

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం జూన్ 2 న అన్ని స‌బ్‌ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో భూముల రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్‌ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే 47 చోట్ల స్లాట్ బుకింగ్ సేవలు అమలవుతుండగా మిగిలిన 97 చోట్ల ప్రారంభిస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు..

ఈ విధానం మంచి ఫలితా లను ఇస్తోందని, స్లాట్” తో రిజిస్ట్రేషన్లు పెరిగాయని మంత్రి తెలిపారు. అలాగే రిజిస్ట్రేష‌న్ సేవ‌ల్లో( ఏఐ) సేవలను ఉపయోగించుకొని ప్రజలకు మరింత సులువైన సమర్థవంతమైన సేవలను అందించబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే వారి సందేహాలు తీర్చడానికి వాట్సాప్ నెంబర్ ను(82476 23578) అందుబాటులోకి తెచ్చామన్నారు.ఆస్తి రిజిస్ట్రేషన్ సేవలను ఆధునీకరించడానికి, క్రమబద్ధీ కరించడానికి ఒక ముఖ్య మైన చర్యగా తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుండి అన్ని సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాలలో స్లాట్ బుకింగ్ వ్యవస్థను ప్రారంభిస్తుందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు.

ఇప్పటివరకు 47 సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన స్లాట్ బుకింగ్ విధా నాన్ని ఇప్పుడు మిగిలిన 97 కార్యాలయాలకు విస్త రించనున్నారు. రాష్ట్రంలోని 144 సబ్-రిజిస్ట్రార్ కార్యా లయాల్లో ఈ వ్యవస్థను అమల్లోకి తెస్తారు. స్లాట్ బుకింగ్ విధానంతో సమర్థ వంతమైన, పారదర్శకమైన, అవినీతిరహిత రిజిస్ట్రేషన్ సేవలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.

స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో జరిగిన సమీ క్షా సమావేశంలో పురోగతి సమాచారాన్ని పంచుకున్న మంత్రి పొంగులేటి..
ఏప్రిల్ 10 నుండి స్లాట్ వ్యవస్థ ద్వారా 45,191 కి పైగా పత్రాలు నమోదు చేయబడ్డాయని, 94% వినియోగదారులు సంతృప్తితో ఉన్నారని వెల్లడించారు..   

Related posts

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్..

M HANUMATH PRASAD

భూభారతి చట్టం కింద పట్టాలిస్తామంటున్న సర్కారు

M HANUMATH PRASAD

హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ సీరియస్

M HANUMATH PRASAD

అగ్నిప్రమాదంలో మృతులు వీరే

M HANUMATH PRASAD

లేఖ పై తొలిసారి స్పందించిన కవిత.. కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

తెలంగాణలో టెన్షన్‌.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత

M HANUMATH PRASAD