Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

రేషన్ డోర్ డెలివరీ డీలర్లు కాదు కరుడు గట్టిన దుర్మార్గులు

రేషన్‌ డోర్‌ డెలివరీ ఆపరేటర్లపై సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరు ప్రజా వేదికలో ఎండీయూ ఆపరేటర్లను టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు..

డోర్ డెలివరీ చేసిన వాళ్లు దుర్మార్గులు, మాఫియా అంటూ ప్రేలాపనలు చేశారు.

”వీళ్లు బియ్యం ఇచ్చినట్టే ఇచ్చి కాకినాడకు తీసుకువెళ్లిపోయారు. కరుడుగట్టిన దుర్మార్గులు వీళ్లు. వేల కోట్లు ఖర్చు పెట్టే మాఫియాగా మారారు. రాజకీయ నాయకులు, ఆఫీసర్లను కొనే పరిస్థితికి వచ్చారు. వాళ్ల కొవ్వు ఎంతుందంటే నా దగ్గరకు కూడా వస్తున్నారు” అంటూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎండియూ ఆపరేటర్లను అవమానపరుస్తూ సీఎం మాట్లాడారు.

రేషన్ డీలర్లను టెర్రరిస్టులతో పోల్చిన సీఎం.. కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారంటూ ఆరోపించారు. గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోవడమే లక్ష్యంగా చంద్రబాబు మాట్లాడారు. వాలంటీర్ల తొలగింపుపై ఒక్క ముక్క కూడా ప్రస్తావించని బాబు.. చేనేత మత్స్యకారులకు విస్తృతంగా సహాయం అందిస్తున్నామంటూ డాంబికాలు పలికారు.

హ్యాండ్లూమ్ కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్ లకు 500 యూనిట్లు విద్యుత్ పథకం అమలు చేయకపోయినా ఇస్తున్నట్లే మాట్లాడిన చంద్రబాబు.. కోనసీమ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పదివేల ఇళ్లకు సోలార్ పవర్ ఉపయోగించేటట్లు చర్యలు తీసుకోవాలంటూ వేదికపైన కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు.

Related posts

తాము యుద్ధం కోరుకోవటం లేదంటూ పాకిస్తాన్ అధికారిక ప్రకటన

ఏపీలో ఆకాశం నుంచి కింద పడుతోన్న మేఘాలు.. వైరల్ అవుతోన్న వీడియోలు. ఇంతకీ ఏం జరుగుతోంది.?

M HANUMATH PRASAD

తుని లయన్స్ క్లబ్ నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకారం

M HANUMATH PRASAD

రెడ్ బుక్ మరువను..! కేడర్‌ను ఇబ్బంది పెట్టినవారిని వదలను..

M HANUMATH PRASAD

దళితుల పట్ల కొనసాగుతున్న వివక్ష

M HANUMATH PRASAD

ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు అవమానం

M HANUMATH PRASAD