తిరుపతిలోని మామండూరులో విషాదం చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్‌లో ఓ విద్యార్థి రైలు పైకి ఎక్కడంతో హైవోల్టేజ్ రైల్వే విద్యుత్ తీగలు తగిలి చనిపోయాడు.
విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోవడంతో చూసిన రైల్వే అధికారులు వెంటనే స్థానిక ఆస్పత్రి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. చనిపోయిన విద్యార్థి డైరీ టెక్నాలజీ చదువుతున్న జాకేష్‌గా పోలీసులు గుర్తించారు. విద్యార్థి రైలు దిగి ఆ తరవాత అవతలివైపునకు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న రైలుపైకి ఎక్కినట్టు తెలుస్తోంది. ప్లాట్ ఫాంపై నుండి వెళ్లకుండా రైలు ఎక్కడం వల్లనే ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు అసలు రైలు ఎందుకు ఎక్కాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.