సమాజంలో రోజు రోజుకి మహిళల పట్ల, వృద్ధుల పట్ల, చిన్నారుల పట్ల అన్యాయాలు, అకృత్యాలు, నిత్య కృత్యం అయిపోయాయాన్ని, ఎవరిని ఆశ్రయించాలో, ఎక్కడికి వెళితే న్యాయం జరుగుతుందో దిక్కు తోచని స్థితిలో చాలా మంది తమ జీవితాలను అర్థంతరంగా ముగించుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమణి, తన మనసును కలచి వేసిందని ప్రముఖ సామజిక వేత్త గెడ్డం భాను ప్రియ అన్నారు. తాను బాధితురాలినేనని, ఆన్లైన్ వేదికగా పరిచయాలకు దూరంగా ఉండాలని, ఎక్కువ మంది ఆన్లైన్ వేదికగా పరిచయాలు పెంచుకుని కళ్ళ బొల్లి కబుర్లు చెప్పి, ధన మాన ప్రాణాలు దోచుకుని అనేకమంది మహిళలను బజారుపాలు చేస్తున్నారని, చేతిలో చిల్లిగవ్వ లేక, న్యాయం సకాలంలో అందక దిక్కులేని స్థితిలో అనేక మంది మనచుట్టూనే ఉన్నారని, దురదృష్టం ఏమిటంటే సమాజం వారిని గమనించే స్థితిలో లేదని భానుప్రియ విచారం వ్యక్తం చేశారు. ఒకరుగా అయితే ఇలాంటి దుష్ట శక్తులమీద పోరాటం చేయాలెమని, కలసి కట్టుగా పోరాటం చేయడం వలన న్యాయం జరిగి తీరుతుందని అన్నారు
ఇలాంటి బాధితులని ఏక తాటి మీదకు తీసుకువచ్చి న్యాయ పోరాటం చేయాలనే ఉద్దేశ్యంతో త్వరలో ఒక సంస్థను స్థాపించనున్నట్లు భాను ప్రియ తెలిపారు. ఏవరూ అన్యాయానికి, హింసకు, గురి కాకూడదనే ఉద్దేశ్యమే సంస్థ లక్ష్యం అన్నారు. ఈ విషయమే సంస్థ ఏర్పాటు చేస్తే న్యాయ పరంగా తాము సహాయం అందిస్తామని ప్రముఖ న్యాయవాదులు అన్నారని, వారి అందరి సహకారంతో బాధితులకు కొంత వరకు ఆదుకునేందుకు సంస్థ సహాయపడుతుందని, సంస్థ వివరాలు త్వరలో తెలియ చేస్తామని శ్రీమతి భాను ప్రియ తెలిపారు.