Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలు

దళితుల పట్ల కొనసాగుతున్న వివక్ష

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17 ప్రకారం దేశంలో అంటరానితనం నిషేధం. అంటరానితనాన్ని పాటించడం తీవ్ర స్థాయి నేరం. ఎవరు ఎక్కడ, ఎప్పుడు ఏ విధంగా అంటరానితనాన్ని పాటించినా కఠిన శిక్షకు అర్హులు

ఈ అంశాలను రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. వీటికి సంబంధించి అనేక చట్టాలు అమల్లో వున్నాయి. అయినప్పటికీ భారతీయ సమాజంలో అంటరానితనం అక్కడక్కడా అప్పుడప్పుడూ ఏదో ఒక రూపంలో బయటపడతూనే ఉంది. దేశంలో అత్యంత ప్రగతిశీలక రాష్ట్రాలుగా గుర్తింపు పొందిన చోట కూడా ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, ఇతర దళిత వర్గాల పట్ల అంటరానితనంతో పాటు అనేక రకాలైన వివక్షలు కనిపిస్తూనే ఉన్నాయి. మన రాష్ట్రంలో ఆధిపత్య కులాలుగా ఉన్న బిసి లు కూడా దళితులపై కులవివక్ష చూపడం బాధాకరం. 2020 నుంచి ఇంత వరకూ దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివక్షకు సంబంధించిన ఘటనలు 900 పైగా చోటు చేసుకున్నట్టు జాతీయ నేర రికార్డులు తెలియజేస్తున్నాయి. ఇందులో అనేక కేసుల్లో కఠిన శిక్షలు విధించడం జరిగింది. దేశంలో అంటరానితనం పూర్తిగా పోలేదనడానికి ఇవి నిదర్శనాలు. అంటరానితనంతో సహా వివిధ రకాల వివక్షల వల్ల దళితులు స్వేచ్ఛగా సంచరించడానికి, అందరితో కలిసి మెలగడానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి.
కాకినాడ జిల్లా పిఠాపురం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆయన సనాతన ధర్మం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. మల్లంలో కనబడిన సామాజిక వివక్ష దాని పర్యవసానమే. కారణం మాకు జరిగిన అన్యాయంపై న్యాయం చెయ్యండి అని ఏకతాటిపై దళితులు నిలబడటమే. దేశంలో ఈ అంశంపై మరోసారి తీవ్ర స్థాయి చర్చకు దారితీసింది. ఇది మరవక ముందే అదే కోవలో విజయనగరం జిల్లాలోని ఓ గ్రామంలో దళితుల పట్ల చూపిన సామాజిక వివక్ష వెలుగులోకి వచ్చింది. జాతీయ రహదారి పక్కనే వున్న కె బిట్రగుంట గ్రామం సాక్షాత్తు మన రాష్ట్ర సాంఘీక శాఖామాత్యులు డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి వారిది. ఈ గ్రామంలో కొందరు దళితులు బుద్దుడి ఊరేగింపు చేస్తే ఆధిపత్య కులాలు వారు అడ్డుకున్నారు. మరోసారి డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహ ఊరేగింపును అడ్డుకున్నారు. “మా వినాయకుడి ఊరేగింపు దర్శనానికి మీ పల్లెలకు రావడం లేదు. మరి మీ బొమ్మలతో మా బజారుకు ఎందుకు వస్తున్నార”ని అడ్డుకున్నారు. వాస్తవానికి ఈ ఘటనతో అంబేద్కర్‌ అందరివాడు కాదు, కొందరివాడని రుజువు చేశారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇదే విధంగా జరుగుతోందని జాతీయ నేర రికార్డులు చెబుతున్నాయి. పైగా ఆలయాల్లో సైతం సాటి మానవుడి పట్ల వివక్షతో వ్యవహరించడం, మానవత్వాన్ని చూపకపోవడం విషాదకరం. అంబేద్కర్‌ ‘అందరూ సమానులే’ అని చెప్పాడు. అటువంటి అంబేద్కర్‌ విగ్రహాల పట్ల, ఊరేగింపుల పట్ల వివక్ష ప్రదర్శించడం అమానుషత్వంగానే భావించాలి. అనేక ప్రాంతాల్లో విగ్రహాలు ధ్వంసం చెయ్యడం, విగ్రహాలకు చెప్పుల దండలు వేసి అవమానించడం, చిత్రపటాలను చింపివేయటం లాంటి ఘటనలు, వివక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకు సాక్షాత్తు మన డిప్యూటీ స్పీకర్‌ రఘరామ కృష్ణరాజు తన నియోజకవర్గంలోని ఓ గ్రామంలో అందరూ చూస్తుండగానే అంబేద్కర్‌ ఫ్లెక్సీని చించి తన అధిపత్య ధోరణిని బయటపెట్టుకున్నారు. ఆలయాల్లోకి ప్రవేశించడానికే కాదు, అగ్రవర్ణాలు నడిచే రోడ్ల మీదా దళితులు నడవకూడదనే ఆంక్షలు కూడా కొన్ని చోట్ల అమలులో ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. అగ్రవర్ణాలు భోజన పలహారాలు చేసే చోట్లలో దళితులు తినకూడదనే ఆంక్షలు కర్ణాటక, తమిళనాడులో వున్నాయి. మన రాష్ట్రంలోని కర్నూలులో కూడా ఇటువంటి దురాచారాలు చోటు చేసుకోవడం మరింత దిగ్భ్రాంతి కలిగించే విషయం. దేశంలో అస్పృశ్యతను ఏడు దశాబ్దాల క్రితమే నిషేధించినప్పటికీ, ఇటువంటి దురాచారాలు, దాడులు, సామాజిక బహిష్కరణలు కొనసాగు తుండడానికి స్థానిక అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తున్నాయి. ఇటీవల తెనాలి ఐతానగరంలో జరిగిన ఘటన అందుకు ఉదాహరణ. సాక్షాత్తు రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌కి మామూలు ఇవ్వలేదనే గొడవలో పక్కనున్న ముగ్గురు కుర్రాళ్ళపై (అందులో ఓ యువ న్యాయవాది కూడా ఉన్నారు) కేసులు పెట్టి అరెస్ట్‌ చేసి నడిరోడ్డుపై కొట్టారు. ధర్డ్‌ డిగ్రీ ప్రదర్శిస్తూ వారి అరికాళ్ళపై కొట్టి వీడియో తీసి దళితులకు ఓ హెచ్చరిక చేశారు. కోర్టుకు చూపించి రిమాండ్‌కి పంపారు. వారిపై రౌడీ షీట్‌ తెరిచారు. గంజాయి ముఠా అని, బ్లేడ్‌ బ్యాచ్‌ అని దుష్ప్రచారం చేశారు. నెల తరువాత ఆ వీడియోను బయటకు వదిలారు. గిరిజన, బలహీన వర్గాలకు చెందిన పోలీస్‌ అధికారులు సైతం ఇందులో భాగస్వాములయ్యారు. ఇది మానవ హక్కులను ఉల్లంఘించడమే. దళితులు కూడా తమ హక్కులు, అధికారాలను మరింతగా వినియోగించుకోవాల్సి ఉంది. చట్టాలు తమకు అనుకూలంగా ఉన్నాయని వారు అర్థం చేసుకోవాలి. మన రాష్ట్ర హోం శాఖామాత్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నక్కపల్లిలో ఇంకో ఘటన జరిగింది. దీనికి సంబంధించి దళితులను వీపరీతంగా కొట్టడమే కాకుండా కౌంటర్‌ కేసులు పెట్టి వేధిస్తున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో దళిత సర్పంచ్‌ పెట్టిన కేసు వెనక్కి తీసుకోకపోవడంతో చంపుతామని బెదిరిస్తున్నారు. అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రంలో ఆకలేసి మామిడి కాయలు కోస్తే… పట్టుకుని కొట్టడమే కాకుండా సాయంత్రం వరకు నిర్బంధించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.
దళితులపై కుల దురహంకార దాడులు, సామాజిక బహిష్కరణలు, పోలీసు వేధింపులు పెరిగిపోతున్నాయి. ఈ ఘటనలు ఎక్కువగా అసెంబ్లీలో చట్టాలు చెయ్యాల్సిన, వాటిని అమలు చెయ్యాల్సిన ప్రజా ప్రతినిధులు, మంత్రుల నియోజక వర్గాలలోనే జరుగుతున్నాయి. వారు ముద్దాయిలను కాపాడే స్ధితిలో ఉన్నారు తప్ప, బాధితులకు రక్షణ కల్పించి న్యాయం చేసే పరిస్థితిలో లేరు. బాధితుల రక్షణ కోసం ఉన్న చట్టాలను అమలు చెయ్యడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రతి ఆరు నెలలకు ఒకసారి…మంత్రి, జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ప్రతి మూడు నెలలకు అత్యాచార నిరోధక విజిలైన్స్‌ మానిటరింగ్‌ సమావేశాలు జరపాలి. సమీక్షించి తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకునేలా, బాధితులకు న్యాయం జరిగేలా ఆదేశాలు ఇవ్వాలి. కానీ నేటికీ అలాంటివి జరగడం లేదు. చట్టాలను అమలు చేయడం, తగిన శిక్షలు వేయడం జరగాలి. వీటితో పాటుగా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించడం, దళితులకు చట్టాల పట్ల అవగాహన కలిగించడం అత్యవసరం. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, సామాజిక కేంద్రాలు, పంచాయతీల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. కులాలకు అతీతంగా సమానత్వాన్ని, సమ న్యాయాన్ని, మానవత్వాన్ని ప్రబోధించాల్సిన అవసరం కూడా ఉంది. రాజ్యాంగపరంగా దళితులకు ఉన్న హక్కులు, అధికారాల గురించి ఇతర వర్గాల్లోనూ, ముఖ్యంగా అగ్రవర్ణాల్లోనూ అవగాహన కలిగించాలి. సామాజిక సంస్కరణల ద్వారా మాత్రమే సాంఘిక దురాచారాలకు తెర పడుతుంది. ఇది మంచి ప్రభుత్వం లక్ష్యంగా ఉండాలని కోరుకుందాం.
కానీ నేటి పాలక పక్షాలు అలా లేవు. జరిగిన దుర్మార్గపు ఘటనలపై కేసులు పెట్టకుండా పోలీసుల ద్వారా రాజీలు చేసే పనిలో ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం జరగాలి. చట్టాల అమలు కోసం, దళితుల రక్షణ కోసం ఐక్య పోరాటాలు జరగాల

Related posts

తప్పించుకోబోయే తెగించి ప్రాణం తీసుకున్నాడు

నేను మీ చెల్లి తో కాపురం చేయాలంటే నువ్వు నాకు సుఖాన్ని ఇవ్వాలి – మరిది అరాచకం

మంగుళూరులో హిందూ కార్యకర్త దారుణ హత్య

85 కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై కేసులు నమోదు

M HANUMATH PRASAD

చార్ ధామ్ యాత్రలో అపశృతి.. ప్రమాదానికి గురైన హెలికాప్టర్.. వీడియో ఇదే..

M HANUMATH PRASAD

ప్రియుడితో దగ్గరుండి పెళ్లి చేసిన భర్త.. వీడియో వైరల్..

M HANUMATH PRASAD