Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

పీఓకేను మనం దక్కించుకోబోతున్నాం : రాజ్ నాథ్ సింగ్

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) ప్రజలు భారత్ కుటుంబంలో భాగమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

వారు భారతీయ జనజీవనానికి స్వచ్చందంగా తిరిగి వచ్చేరోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు. గురువారమిక్కడ సీఐఐ బిజినెస్ సమ్మిట్ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ పీవోకే ప్రజల్లో అత్యధికులు భారత్ తో ఒక ప్రగాఢమైన బంధం ఉందని భావిస్తుంటే కొద్ది మంది మాత్రం పెడదారి పట్టారని మంత్రి తెలిపారు. పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే టెర్రరిజమ్, పీవోకే పైన మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. భారత్ దేశీయ రక్షణ సామర్థ్యాలను గురించి మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం రక్షణ రంగానికి సంబంధించి భారత్ ఎగుమతుల విలువ రూ.1,000 కోట్లు కన్నా తక్కువ ఉంటే ప్రస్తుతం అది రికార్డుస్థాయిలో రూ.23,500 కోట్లకు చేరుకుందని చెప్పారు.

నేడు రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారత్ భద్రత, సౌభాగ్యానికి ఎంతో ముఖ్యమైందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సంద ర్భంగా దేశీయంగా తయారైన ఆయు ధాలు, క్షిపణులు, డ్రోన్లు అద్భుతమైన వాటి పనితీరుతో యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసాయని చెప్పారు. నేడు భారత్ పైన చెపి ్పనవాటితో పాటుగా యుద్ధానికి సంబంధించిన నవశకపు టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తోందని తెలిపారు.

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) ప్రజలు భారత్ కుటుంబంలో భాగమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. వారు భారతీయ జనజీవనానికి స్వచ్చందంగా తిరిగి వచ్చేరోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు. గురువారమిక్కడ సీఐఐ బిజినెస్ సమ్మిట్ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ పీవోకే ప్రజల్లో అత్యధికులు భారత్ తో ఒక ప్రగాఢమైన బంధం ఉందని భావిస్తుంటే కొద్ది మంది మాత్రం పెడదారి పట్టారని మంత్రి తెలిపారు. పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే టెర్రరిజమ్, పీవోకే పైన మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. భారత్ దేశీయ రక్షణ సామర్థ్యాలను గురించి మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం రక్షణ రంగానికి సంబంధించి భారత్ ఎగుమతుల విలువ రూ.1,000 కోట్లు కన్నా తక్కువ ఉంటే ప్రస్తుతం అది రికార్డుస్థాయిలో రూ.23,500 కోట్లకు చేరుకుందని చెప్పారు.

Related posts

భారత జవాన్ను విడిచిపెట్టిన పాకిస్తాన్..

M HANUMATH PRASAD

బదిలీపై వెళ్తున్న పోలీస్.. వెళ్లొదంటూ వెక్కివెక్కి ఏడ్చిన జనం.. వైరల్‌ అవుతున్న వీడియో!

M HANUMATH PRASAD

డీఎస్పీ వాహనానికి నిప్పు పెట్టిన ఇసుక మాఫియా.. ఘర్షణలో ఒకరు మృతి

M HANUMATH PRASAD

ప్రత్యేక బెంచ్‌ను నియమించిన బాంబే హైకోర్టు

M HANUMATH PRASAD

రాజ్యసభకు కమల్‌ హాసన్‌.. డీఎంకే అధికారిక ప్రకటన

M HANUMATH PRASAD

బాబోయ్ పులి తినేసింది

M HANUMATH PRASAD