Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్‌ ఆర్మీ చీఫ్‌

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌ను దెబ్బ కొడుతూ భారత్‌ తీసుకున్న నిర్ణయాల్లో సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత ఒకటి. ఆ ఒప్పందంపైపాకిస్తాన్‌ ఆర్మీ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ స్పందించారు.

సింధు జల ఒప్పందం (IWT) తన దేశానికి రెడ్ లైన్‌ అని అభివర్ణించారు. నీటి సమస్యపై ఇస్లామాబాద్ (పాక్‌ రాజధాని) ఎప్పటికీ రాజీపడదు’ అని ప్రకటించారు.

పాకిస్తాన్‌లో జరిగిన వివిధ యూనివర్సిటీల వైస్‌ ఛాన్సిలర్లు, ప్రిన్సిపల్స్‌, సీనియర్‌ ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో జరిగిన సమావేశంలో అసిమ్‌ మునీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునీర్‌ మాట్లాడుతూ.. రెడ్‌లైన్‌ అనేది పాకిస్తాన్‌ నీరు. 24 కోట్ల పాకిస్తానీయుల కనీస హక్కు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమంటూ భారత్‌ సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేతపై గురించి ప్రస్తావించారు.

గత నెల ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్తాన్‌ ముష్కరులు అమాయకులైన టూరిస్టుల ప్రాణాలు తీశారు. ఈ దుర్ఘటనలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకు పాకిస్తాన్‌పై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌ ఆటకట్టించేందుకు ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టింది. ఏప్రిల్‌ 7న పాకిస్తాన్‌, పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాదుల స్థావరాల్ని నేలమట్టం చేసింది. వందల మంది పాక్‌ ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపింది.

అదే సమయంలో భారత్‌- పాక్‌ మధ్య 1960లో సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్‌లో నీటి యుద్ధాలు మొదలయ్యాయి. తాగేందుకు,వ్యవసాయం చేసేందుకు, నిత్యవసరాలకు వినియోగించుకునేందుకు నీరు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ పాక్‌ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తూ తీసిన వీడియోలో సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వంపై అసమ్మతి మొదలైంది. ఆ అసమ్మతిని చల్లార్చేందుకు భారత్‌కు లేఖ రాసింది.

తీవ్రంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నానమని, సింధూ జలాల విషయంలో భారత్‌ తీసుకున్న నిర్ణయంలో పునసమీక్షించుకోవాలని ప్రాధేయపడింది. భారత్‌ మాత్రం సున్నితంగా తిరస్కరించింది. పాకిస్తాన్‌ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు విరమించుకునే వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Related posts

సింధు ఒప్పందంపై భారత్ కు అంతర్జాతీయ కోర్టు షాక్-తోసిపుచ్చిన కేంద్రం..!

M HANUMATH PRASAD

1971 నాటి దాడికి ప్రతీకరమా — పెద్ద జోక్

M HANUMATH PRASAD

పాక్ తరుఫున పోరాడిన తుర్కియే సైనికులు.. ఇద్దరు హతం.. తీవ్ర కలకలం

M HANUMATH PRASAD

నాన్నా.. చిత్రహింసలతో చంపేస్తున్నారు!

M HANUMATH PRASAD

వాషింగ్టన్‌లో ఉగ్రదాడి.. ఇజ్రాయెల్‌ ఎంబసీ ఉద్యోగులను కాల్చి చంపిన ముష్కరులు

M HANUMATH PRASAD

భారత్‌కు పాకిస్తాన్‌ లేఖ

M HANUMATH PRASAD