Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

రిసెప్షనిస్ట్‌ అంకిత కేసులో సంచలన తీర్పు

దాదాపు మూడేళ్ల కిందట.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంకితా భండారి కేసు (Ankita bhandari Case)లో సంచలన తీర్పు వెలువడింది. లైంగిక వాంఛ తీర్చలేదని ఆమె పని చేసే రిసార్ట్‌ ఓనరే ఆమెను దారుణంగా హత్య చేశాడు.

ఈ కేసులో ముగ్గురు నిందితులను దోషులుగా తేలుస్తూ ఉత్తరాఖండ్‌ స్థానిక కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది.

పౌరీ జిల్లాకు చెందిన అంకిత భండారి(19) రిషికేష్‌లోని వంతారా రిసార్ట్‌లో రిసెప్షనిస్టుగా పని చేసేది. అయితే 2022 సెప్టెంబర్‌ 18వ తేదీ నుంచి ఆమె కనిపించకుండా పోయింది. నాలుగు రోజుల తర్వాత ఆమె మృతదేహం స్థానికంగా ఉన్న ఓ కాలువలో కనిపించింది. ఆమెపై హత్యాచారం జరిగి ఉండొచ్చన్న ప్రచారంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.

పుల్కిత్‌ ఆర్య తండ్రి వినోద్‌ ఆర్య బీజేపీ నేత. దీంతో కేసు నుంచి అతన్ని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ విమర్శల నేపథ్యంలో వినోద్‌ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఏర్పాటు చేశారు.

మరోవైపు.. జస్టిస్‌ ఫర్‌ అంకిత పేరుతో యువత రోడ్డెక్కింది. ఇటు సోషల్‌ మీడియాలోనూ #Justiceforankitaఉద్యమం నడిచింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆమె హత్యకు గురైనట్లు తేలింది. ఈ కేసులో రిసార్ట్‌ ఆపరేటర్‌ పుల్కిత్‌ ఆర్య, మరో ఇద్దరు ఉద్యోగులు సౌరభ్‌ భాస్కర్‌, అకింత్‌ గుప్తాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్‌ నివేదిక ధృవీకరించింది.

తన రిసార్ట్‌కు వచ్చేవాళ్లతో పాటు తనకూ పడక సుఖం అందించాలని అంకితపై పుల్కిత్‌ ఒత్తిడి తెచ్చాడు. అయితే అందుకు ఆమె లొంగలేదు. 2022 సెప్టెంబర్‌ 18వ తేదీన ఆమెతో ఈ అంశంపై వాగ్వాదానికి దిగాడు. జరిగిన పెనుగులాటలో పుల్కిత్‌, మరో ఇద్దరు సహోద్యోగులతో కలిసి ఆమెను కాలువలోకి తోసి చేశాడని తేలింది. హత్య, లైంగిక వేధింపులతో పాటు పలు నేరాల సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. సిట్‌ దర్యాప్తు పూర్తి చేసి 500 పేజీల ఛార్జిషీట్‌ రూపొందించింది.

2023 మార్చి చివర్లో కోట్‌ద్వార్‌ కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. మొత్తం 97 మంది సాక్షుల్లో.. 47 మందిని కోర్టు విచారించింది. రెండేళ్లపాటు సాగిన విచారణ తర్వాత.. ఇవాళ(మే 30వ తేదీన0 అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి రీనా నెగి.. ఆ ముగ్గురిని దోషులుగా ప్రకటించారు. దోషులకు శిక్ష ఖరారు కావాల్సి ఉండగా.. అంకిత కుటుంబం మరణ శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తోంది.

Related posts

పాక్ కాల్పులలో జమ్మూ కాశ్మీర్ అధికారి మృతి-షాక్ లో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

M HANUMATH PRASAD

పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్

M HANUMATH PRASAD

అడ్రస్‌ లేకపోతే తిహాడ్‌ జైలులోనే ఉంటారు

M HANUMATH PRASAD

రాష్ట్రపతికి సుప్రీం కోర్టు డెడ్‌లైన్‌ పెట్టొచ్చా.. ద్రౌపది ముర్ము సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

సుప్రీం తీర్పును ప్రశ్నించిన ముర్ము – సీఎం స్టాలిన్ విమర్శలు

M HANUMATH PRASAD

అందరూ చూస్తుండగానే, నాలుగు నెలల చిన్నారిని కొరికి చంపేసిన పెంపుడు కుక్క..!

M HANUMATH PRASAD