Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

లగేజ్ కోసం వెళ్లి చిక్కిన భయ్యా సన్నీ యాదవ్.. ఎన్ఐఏ కార్యాలయానికి తరలింపు

యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ని చెన్నెలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన భయ్యా సన్నీ యాదవ్ నూతనకల్ మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి పూర్తి చేశాడు.

ఖమ్మంలో ఇంటర్ వరకు చదివి అనంతరం బైక్ రైడింగ్ నేర్చుకున్నాడు. సన్నీ యాదవ్ తల్లిదండ్రులు భయ్యా రవి, శ్రీదేవి నూతనకల్ మండల కేంద్రంలో మెడికల్ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నిత్యం యూట్యూబ్ లో గడిపే సందీప్ (సన్నీ) కి ఓ ఆలోచన వచ్చి యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ పెరగడంతో ద్విచక్ర వాహనం తో విదేశాలు తిరగాలని ప్లాన్ చేసుకొని ద్విచక్ర వాహనం పైన కొన్ని దేశాలను తిరిగి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు.

విదేశాలు తిరగడానికి డబ్బులు అవసరం అవ్వడం తో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తుండేవాడని పోలీసులు అనుమానించారు. అదే సమయంలో యూట్యూబ్‌ వీడియోలతో బెట్టింగ్‌ యాప్‌ లను ప్రచారం చేస్తున్న సన్నీ యాదవ్‌ పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సోషల్ మీడియాలో సన్నీ బెట్టింగ్ యాప్ లకు వ్యతిరేకంగా పోస్ట్ చేశారు. దానిని సూర్యాపేట జిల్లా ఎస్పీ సోషల్‌ మీడియా అకౌంట్ కు ట్యాగ్‌ చేశారు. ఆ ఫిర్యాదుని సుమోటోగా తీసుకుని,బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణహాని ఉండడంతో గతంలో సూర్యాపేట జిల్లా పోలీసులు భయ్యా సన్నీ యాదవ్ పై 111(2)318(4)46r/w,61(2)BNs 3,4,TSGA 66C66,DITA2000-2008 ఇలా పలు సెక్షన్ల కింద ఛీటింగ్ కేసులు నమోదు చేశారు.

యూట్యూబర్‌ సన్నీయాదవ్‌పై లుక్ ఔట్ నోటీసులు

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో యూ ట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ భయ్యా సన్నీ యాదవ్ పై గతంలో పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు . బెట్టింగ్ ప్రమోషన్ల విషయంలో సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గతంలో విచారణ చేయగా విదేశాల్లో ఉన్నట్లు గుర్తించి పోలీసులు లుక్ ఔట్ సర్కులర్ జారీ చేశారు. విదేశాల నుంచి ఏ మార్గంలో భారత్ వచ్చిన ఇమిగ్రేషన్ అధికారుల ద్వారా సన్నీ ని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలపడంతో కోర్టును ఆశ్రయించి ఆర్డర్ తెచ్చుకున్నారు. పోలీసులు కోర్టు ఆర్డర్ ప్రకారం అరెస్ట్ చేయకుండా తమకు తెలియకుండా దేశం దాటి వెళ్లవద్దని సూచించారు.

ఇటీవల పాకిస్తాన్ లోబైక్ రైడ్ పూర్తి చేసినట్లు వీడియో విడుదల చేసిన భయ్యా

సన్నీ యాదవ్ ఇటీవల పాకిస్తాన్ లో బైక్ రైడ్ పూర్తి చేసినట్లు వీడియోలు విడుదల చేశాడు. పాకిస్తాన్ లో పాకిస్తాన్ నివాసనుడితో జైశ్రీరామ్ అంటూ ఓ వీడియో, పాకిస్తాన్ లో సిమ్ము కోసం ఎన్నో కష్టాలు అనే వీడియో, హైదరాబాద్ టు పాకిస్తాన్ బైక్ పై సాహస యాత్ర అనే వీడియో, పాకిస్తాన్ ఆర్మీ వ్యక్తి షాక్ అనే పలు వీడియోలు సన్నీ యాదవ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. అక్కడే రెండు నెలల వరకు తిరిగి టూర్ వీడియో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అయితే, ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ వీడియోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎలాంటి వీడియోలను పోస్ట్ చేయడకూడదని కేంద్ర ప్రభుత్వ అడ్వైజర్ జారీ చేసింది.

కానీ సన్నీ యాదవ్ నిబంధనలకు విరుద్ధంగా ఇటీవలే పాకిస్తాన్ బైక్ రైడ్ వీడియోలను అప్లోడ్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు అతడిని చెన్నై ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. గతంలో నే సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ ముగించుకొని ఇండియాలోనే ఉండి వీడియోలు అప్లోడ్ చేశాడా, ఇండియా పాకిస్తాన్ సింధూర్ యుద్ధం జరుగుతున్న వేళ పాకిస్తాన్ లోనే ఉండి వీడియోలు అప్లోడ్ చేశాడా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయాలపై ఎన్ఐఏ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రైవేట్ కంపెనీలతో అగ్రిమెంట్

ద్విచక్ర వాహనంపై విదేశాలు తిరుగుతూ ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ని పెంచుకున్న భయ్యా సన్నీ యాదవ్ కొన్ని ప్రైవేటు కంపెనీలతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడని తెలుస్తుంది. ఓ ఇంజన్ ఆయిల్ కంపెనీతో సంవత్సరానికి రూ. 50 లక్షలు అగ్రిమెంట్ కుదిరించుకున్నారని సమాచారం. బైక్ మీద విదేశాలు తిరుగుతూ తమ ఆయిల్ కంపెనీని ప్రమోషన్ చేయాల్సిందిగా, అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిసింది. అలాగే కొన్ని ద్విచక్ర వాహనాల ప్రమోషన్లు టైర్ల ప్రమోషన్లు, స్పేర్ పార్ట్స్ ప్రమోషన్లు చేయాలని కొన్ని ప్రైవేటు కంపెనీలు బయ్యా సన్నీ యాదవ్ తోటి అగ్రిమెంట్లు చేయించుకున్నట్లు సమాచారం.

వీటితో పాటుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు కూడా చేస్తూ డబ్బులు సంపాదిస్తుడటం, బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణహాని ఉండడంతో పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ప్రమోషన్ల ద్వారా వచ్చిన డబ్బులతో ప్రస్తుతం మూడు కోట్ల రూపాయల వ్యయంతో నూతనకల్ మండల కేంద్రంలో ఇల్లు నిర్మిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు పౌర సమాజం జిల్లా యువత పై దృష్టి సారించి చెడు మార్గం లను యువత ఎంచుకోకుండా, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశ పడుతున్న యువతపై దృష్టి సారించి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి యువతని మంచి మార్గంలో నడిపించేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Related posts

ప్రపంచ సంగీత దినోత్సవ కాంపిటీషన్ లో పాల్గొన్న చిరంజీవి అభినయ శివానంద

M HANUMATH PRASAD

ఆత్మాహుతికి సిద్ధమైన సమీర్‌, సిరాజ్‌! దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్రణాళిక

M HANUMATH PRASAD

పంతలమ్మ, పంతులయ్యకు రెండో వివాహం… పెళ్లిని చెడగొట్టిన మరో ఉపాధ్యాయుడు

M HANUMATH PRASAD

హయత్ నగర్లో కారు దగ్దం

వృద్ధ రైతుపై ఏఎస్ఐ జులుం..

M HANUMATH PRASAD

ఏపీ సీఎం కు తెలంగాణ సీఎం చురకలు

M HANUMATH PRASAD