అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్‌కు యూఎస్ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ‘లిబరేషన్ డే’ సందర్భంగా పలు దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌ల విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అత్యవసర పరిస్థితిలో మాత్రమే అధ్యక్షుడికి ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని మాన్‌హట్టన్ కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో, ట్రంప్ ప్రభుత్వానికి చుక్కెదురైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు (Trump Tariffs) అమలుకాకుండా యూఎస్ ట్రేడ్ కోర్టు నిలుపుదల చేసింది. ఈ క్రమంలో మాన్‌హట్టన్ కోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల బృందం తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కేవలం కాంగ్రెస్‌కే ఉంది. విశేష అధికారాలతో టారిఫ్‌లు విధించడం సరికాదు. ఇది రాజ్యాంగ వ్యవస్థలను బలహీన పరచడమే అవుతుంది అని చెప్పుకొచ్చింది.