Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

రేప్ కేసులో సుప్రీం సంచలన వ్యాఖ్యలు

రేప్ కేసు విచారణలో సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఢిల్లీ నోయిడా ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల మహిళను స్వీట్లో మత్తు పదార్థాలు కలిపి లైంగిక దాడి చేసిన విషయంలో, 23 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పై రేప్ కేసు నమోదు చేశారు పోలీసులు

కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 40 ఏళ్లు ఉన్న ఆమె చిన్న పిల్ల కాదు.. ఆమె అనుమతి లేకుండా చేశాడంటే నమ్మాలా, ఒకే చేతితో చప్పట్లు మోగుతాయా ? ఆమె చిన్న పిల్ల ఏం కాదు కదా ? అతడిపై సెక్షన్ 376 ఎలా నమోదు చేశారు అంటూ బాధిత మహిళ పట్ల సంచలన వ్యాఖ్యలు చేసింది జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం.

తొమ్మిది నెలలు జైల్లో గడిపిన యువకుడి బెయిల్ విచారణ జరిపే సమయంలో, పోలీసుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తొమ్మిది నెలలు జైల్లో ఉన్నా ఆ ఆరోపణలు ఎందుకు నిరూపించలేదంటూ, ఆమె 40 ఏళ్ల మహిళ చిన్నపిల్ల కాదు అతడితో పలుసార్లు జమ్ముకు కూడా వెళ్లిందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే ఆ యువకుడిపై పెట్టిన క్రూరమైన సెక్షన్ల పట్ల ఎలాంటి ఆధారాలు లేవని, యువకుడి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.

Related posts

సుప్రీం తీర్పును ప్రశ్నించిన ముర్ము – సీఎం స్టాలిన్ విమర్శలు

M HANUMATH PRASAD

పెళ్లయిన రెండు నెలలకే ఇద్దరూ జంప్‌.. అత్తకు 55, అల్లుడికి 25 ఏళ్లు

M HANUMATH PRASAD

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాల్లేవ్: పోలీసులు

M HANUMATH PRASAD

తప్పించుకోబోయే తెగించి ప్రాణం తీసుకున్నాడు

సైన్యం మోడీ కాళ్లు పట్టుకోవాలట – డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

నాన్నా.. చిత్రహింసలతో చంపేస్తున్నారు!

M HANUMATH PRASAD