Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

రాజ్యసభకు కమల్‌ హాసన్‌.. డీఎంకే అధికారిక ప్రకటన

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌ హాసన్‌(Kamal Haasan) రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారయినట్లే!. తమిళనాడు నుంచి ఆయనకు ఈ పదవి దక్కనుంది

కమల్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ డీఎంకే బుధవారం అధికారిక ప్రకటన చేసింది.

రాజ్యసభలో ఖాళీగా ఉన్న 8 స్థానాలకుగానూ వచ్చే నెల(జూన్‌) 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆరు తమిళనాడు నుంచి, రెండు అసోం నుంచి ఉన్నాయి. తమిళనాడులో ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే.. డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన ఆరు సీట్లలో నాలుగింటిని డీఎంకే.. మరో రెండింటిని అన్నాడీఎంకే దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

నలుగురు అభ్యర్థుల్ని డీఎంకే(DMK) ఇవాళ ప్రకటించగా.. అందులో కమల్‌ హాసన్‌(70) కూడా ఉన్నారు. మిగిలిన ముగ్గురు.. సిట్టింగ్‌ ఎంపీ విల్సన్‌, తమిళ రచయిత సల్మా, డీఎంకే నేత ఎస్‌ ఆర్‌ శివలింగం. దీంతో కమల్‌ రాజ్యసభకు వెళ్లడం లాంఛనమే కానుంది.

2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్‌ హాసన్‌ ఎన్‌ఎంఎం(Makkal Needhi Maiam) పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసినప్పటికీ. ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే.. ఓటు షేర్‌ మాత్రం 3.72 శాతం దక్కించుకుంది. మరీ ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు, మధురైలో భారీగా ఓట్లు పడ్డాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.

2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేకపోయింది. కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్‌.. బీజేపీ అభ్యర్థి వనతిశ్రీనివాసన్‌ చేతిలో 1,728 ఓట్ల మెజారిటీలోఓటమి పాలయ్యారు. 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా.. 140 స్థానాలకు ఒక్కటి కూడా గెలవలేకపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇండియా కూటమి(INDIA Alliance)కి కమల్‌ పార్టీ ఎంఎన్‌ఎం మద్దతు ప్రకటించి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డీఎంకే ఎంఎన్‌ఎం మధ్య ఓ ఒప్పందం కుదిరినట్లు తమిళ మీడియా వర్గాలు కథనాలు ఇచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడమా? లేదంటే రాజ్యసభకు వెళ్లడమా? అనే ఛాయిస్‌ కమల్‌కు డీఎంకే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన రాజ్యసభకే మొగ్గు చూపినట్లు ఆ కథనాల సారాంశం.

Related posts

హిందూ మతాన్ని వీడారు.. దేశ ద్రోహానికి పాల్పడ్డారు.. బయటపడ్డ సంచలన నిజాలు..!!

M HANUMATH PRASAD

మోడీ ఒక డమ్మీ ప్రధాని.. ట్రంప్ డిఫాక్టో ప్రధాని వ్యవహరిస్తుండు: సీపీఐ నారాయణ విమర్శలు

M HANUMATH PRASAD

పబ్లిసిటీ స్టంట్లు అవసరమా..: ప్రొఫెసర్‌పై సుప్రీం పైర్

M HANUMATH PRASAD

నా భర్త.. నన్ను తన పార్టీ నాయకులతో..! అధికార పార్టీ నేతపై మహిళ సంచలన ఆరోపణలు

M HANUMATH PRASAD

కీలక పరిణామం.. జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

M HANUMATH PRASAD

ముంబై ఎయిర్‌పోర్టులో కేఏ పాల్ హంగామా

M HANUMATH PRASAD