ఉగ్రవాదులకు ప్రోత్సాహమందిస్తున్న పాకిస్థాన్ తీరును ఎండగట్టేందుకు గల్ఫ్‌లో పర్యటిస్తున్న అఖిలపక్ష బృందంలో సభ్యుడైన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ అస్వస్థతకు గురయ్యారు
ఆజాద్ కు కడుపులో నొప్పి వచ్చిందని, కువైట్ లో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. పాక్(Pakistan) ఉగ్రకార్యకలాపాలను ఎండగట్టేందుకు సౌదీకి వెళ్లిన బృందంలో ఆయన ఒకరు. బీజేపీ(BJP) నాయకుడు, ఎంపీ బైజయంత్ జే పాండా మాట్లాడుతూ .. ఆజాద్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనకు కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది. బహ్రెయిన్, కువైట్లో జరిగిన సమావేశాలకు ఆయన చేసిన సేవలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. సౌదీ అరేబియా, అల్జీరియాలో సమావేశాల్లో ఆయన్ని మిస్ అవుతామని వెల్లడించ్చారు